డేటా పెంచిన Vodafone ఇప్పుడు రోజుకు 1.6 GB డేటా
ప్రస్తుతం రోజువారి 1.5GB డేటా అందిస్తున్న,రూ.209 మరియు రూ. 479 ప్లాన్ల పైన డేటాని పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్లతో, రోజువారి 1.6GB 3G/4G డేటా అందిస్తోంది.
ప్రస్తుతం నడుస్తున్న టెలికం పోటీని తట్టుకోవడావికి అన్ని కంపెనీలు కూడా వారి వారి ప్లాన్స్ అందించడం పరిపాటైపోయింది. ఇప్పుడు, వోడాఫోన్ కూడా ముందునుండి అందుబాటులో వున్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేసింది. అవేమిటంటే, వోడాఫోన్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్స్ అయినటువంటి, రూ.209 మరియు రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్.
ముందుగా, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లతో రోజువారి 1.5GB డేటా అందిస్తుండగా, ఇప్పుడు దీనిపైన 100 MB డేటాని పెంచింది. అంటే, ఇప్పుడు రూ.209 మరియు రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్లతో రోజువారీ 1.6GB డేటాని వినియోగదారులు పొందుతారు. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS ప్రయోజనాలు కూడా వినియోగదారులకి అందుతాయి. రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఈ రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
అయితే, వోడాఫోన్ యొక్క ప్రధాన పోటీదారులైనటుంటి ఎయిర్టెల్ మరియు జియో వంటి వాటితో పోలిస్తే, రూ.198 ధరలో జియో అత్యధికంగా రోజువారి 2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ100SMSలను అందించగా, ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారి 1.5GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ100SMSలను అందిస్తోంది.మూడు కంపెనీల యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు. కాబట్టి, ఎప్పటిలాగే జియో ప్రీపెయిడ్ ప్లాన్ పైచేయిగా నిలుస్తుంది.