వోడాఫోన్ ఐడియా కొత్త Rs.1,999 వార్షిక ప్లాన్ విడుదల

Updated on 07-Feb-2019
HIGHLIGHTS

రోజువారీ 1.5GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ 365 రోజుల వ్యాలిడిటీ.

భారతీయ టెలికాం ఆపరేటర్లు, ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం కోసం రోజు రోజు సరికొత్త ప్రణాళికలను ప్రకటిస్తున్నారు.  అయితే, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్స్ , అంటే ముందుగా డబ్బు చెల్లించే చందాదారులకి ఎక్కువగా అందించబడుతున్నాయి . అన్ని కంపెనీలు కూడా అనేక రీఛార్జ్ ప్రణాళికలో  కనీస ప్రయోజనాలుగా డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ని టార్గెట్ చేసుకునే అందిస్తున్నాయి, ఇది సామాన్యంగా 28 రోజులు చెల్లుబాటుతో అందుతుంటాయి. అలాగే  కొన్ని పూర్తి సంవత్సరానికి కూడా వస్తాయి. ఈ విభాగంలో, వోడాఫోన్ ఐడియా ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక ప్రణాళిక రూ 1,699 అందుబాటులో ఉండగా,  ఇప్పుడు ఈ టెలికం కంపెనీ మరొక వార్షిక ప్రణాళిక అయినటువంటి Rs 1,999 ప్రీపెయిడ్ ప్రణాలికను ప్రారంభించింది.

ఈ ప్రీపెయిడ్ ప్లాను, పూర్తిగా ఒక  సంవత్సరం అంటే  365 రోజులు చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లానుతో వినియోగదారులు రోజుకి 1.5GB 2G / 3G / 4G డేటా అందిస్తుంది మరియు డేటా పరిమితి ముగిసిన తరువాత వినియోగదారులు 1MB కోసం 50 పైసలు రేటు చొప్పున చెల్లించి డేటా యాక్సెస్ చేయవచ్చు. 

వినియోగదారులు కూడా ఈ ప్రణాళికలో ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత స్థానిక మరియు జాతీయ కాల్స్ ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు. అదనంగా, ప్రతి రోజు 100 SMS లను ఈ ప్రణాళితో పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్, వోడాఫోన్ మరియు ఐడియా సెల్యులార్ రెండు నెట్వర్కుల చందాదారులకు  కూడా అందుబాటులో ఉంటుంది.  అలాగే,  ప్రస్తుతానికి ఈ ప్రణాళిక కేరళ సర్కిల్లో మాత్రమే అందించారు. కానీ, త్వరలోనే అన్ని సర్కిళ్లకు విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు.  

వోడాఫోన్, ఇటీవల కంపెనీ యొక్క 4G సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా ఒక కొత్త రూ .119 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అదేవిధంగా, ఐడియా సెల్యులార్ కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ మొదలైన కొన్ని సర్కిళ్లలో రూ .119 ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో,  వినియోగదారులకు  28 రోజులకు గాను 1GB డేటా అందుకుంటారు. కానీ, దీనితో అన్లిమిటెడ్ కాలింగ్ లాభాన్ని వినియోగదారులు అందుకుంటారు FUP పరిమితిని దీనికి వర్తింప చేయలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :