ఎయిర్టెల్, ఇప్పటికే 10 సర్కిళ్లలో సరికొత్త 4G నెట్వర్కుతో వినియోగదారులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అదేబాటలో, ఇప్పుడు వోడాఫోన్ కూడా తన ఎయిర్ వేవ్స్ లలో మార్పులు చేసింది. ఈ రెండు ప్రధాన టెలికం సంస్థలు కూడా నానాటికి గణనీయమైన విస్తరణను కొనసాగిస్తున్న జియో ని, తమ కొత్త ప్రణాళికలతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా, ఢిల్లీ, ముంభై,ఆంధ్రప్రదేశ్ సహా 10 సర్కిళ్లలో 900MHz ఎయిర్ వేవ్స్ తీసుకొచ్చిన ఎయిర్టెల్, ఇప్పుడు దానికి కొనసాగుంపుగా మరో 6 సర్కిళ్లలో కూడా ఈ సాంకేతికతను ఇవ్వనుంది. ఇందులో, అస్సాం , బీహార్, జమ్మూ & కాశ్మిర్, తూర్పు-UP మరియు పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, కంపెనీ ఈ ఎయిర్ వేవ్స్ లలో మార్పులు చేయడం ద్వారా గణనీయమైన 4G స్పీడ్ వినియోగదారులు అందుకోవచ్చని చెబుతోంది. అలాగే, ఇది ఇల్లు, ఆఫీసులు మరియు షాపింగ్ మాల్స్ వంటి ఇండోర్ పరిస్థితుల్లో కూడా మంచి వేగాన్ని అందుకుంటారని కూడా వివరిస్తోంది.
ఇక వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ప్రస్తుతం ముంబైలో తన ఎయిర్ వేవ్స్ లలో మార్పులు చేయడం ద్వారా మెరుగైన 4G వేగంన్ని పెంచినట్లు తెలుస్తోంది. అయితే, మిగిలిన సర్కిళ్లలో ఈ మార్పును చేయడానికి కొంత సమయమా పట్టవచ్చు. కానీ, దీని ఉపకరణాల మార్పుకు సంభందినచిన కాంట్రాక్టును ఇప్పటికి ఇచ్చినట్లు, కొన్ని నివేదిక ద్వారా తెలుస్తోంది కాబట్టి మిగిలిన ప్రధాన సర్కిళ్లలో త్వరలోనే ఈ మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది.
అయితే, 4G పైపు మొగ్గుచూపేవారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరగడం మరియు 3G నుండి 4G కి మారే వారి సంఖ్య కూడా నానాటికి గణనీయంగా పెరగడంతో, అన్ని ప్రధాన టెలికం కంపెనీలు కూడా వారి నెట్వర్కులలో గణనీయమైన మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా, వారి వినియోగదారులకి మంచి 4G స్పీడ్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.