వోడాఫోన్ వినియోగదారులకి 1 సంవత్సరమంతా డైలీ 1.5GB డేటా ఉచితం : ఎలాగో తెలుసా ?
ఇందుకోసం వోడాఫోన్ వినియోగదారులు, వోడాఫోన్ ఆప్ లేదా వెబ్ పేజీ నుండి సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు కోసం నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
వోడాఫోన్ తన వినియోగదారులకి, రోజుకు 1.5 GB డేటాని ఉచితంగా అందిచనుంది. ముందుగా టెలికం టాక్ అందించిన నివేదిక ప్రకారం, ఇందుకోసం వోడాఫోన్ వినియోగదారులు, వోడాఫోన్ ఆప్ లేదా వెబ్ పేజీ నుండి సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు కోసం నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బ్యాంకు రూల్స్ ప్రకారంగా ఈ క్రెడిట్ కార్డును పొందిన తరువాత, ఆ కార్డును ఉపయోగించి 4,000 రూపాయల షాపింగ్ చేయాల్సివుంటుంది.
అంతేకాదు, ఈ చేసే చాపింగును కూడా కేవలం కార్డు చేతికొచ్చిన 30 రోజుల లోపుగానే చేయాల్సి ఉంటుంది. అలాగే, దీనితో పాటుగా బ్యాంక్ కండిషన్ల విషయానికి వస్తే, కేవలం జూలై 31 వ తేదీ వరకూ మాత్రమే ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే, ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ అఫర్ అన్నమాట. అంతేకాదు ఈ కారుకు అప్లై చేసేవారికి కనీసం 23 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
అధనంగా, ఈ పైన తెలిపిన అన్ని వివరాలు సరిపోయినా కూడా మరొక కండిషన్ వుంది. అదేమిటంటే, ఈ అన్ని వివరాలు సరిపోయిన అవోడాఫోనే వినియోగదారుడు, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, పూణే, ముంబాయి, గురుగ్రామ్, అహ్మదాబాద్, జైపూర్ మరియు చండీఘడ్ వంటి సిటీలకు చెందిన వారికీ మాత్రమే ఈ కార్డు దొరుకుతుంది.