వోడాఫోన్ 5G నెట్వర్క్ మొట్టమొదటి కమర్షియల్ ట్రయల్ పూర్తి చేసింది
ఈ ట్రయల్ లో భాగంగా 4K వీడియో కాల్ నిర్విఘ్నంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
వోడాఫోన్ 5G నెట్వర్క్ మొట్టమొదటి కమర్షియల్ ట్రయల్ పూర్తి చేసినాట్లు తెలుస్తోంది. అయితే, ఇది మనదేశంలో మాత్రం కాదు. ఈ బ్రిటిష్ టెలికం దిగ్గజం, ఈ బుధవారంనాడు ఈ 5G నెట్వర్క్ యొక్క మొట్టమొదటి కమర్షియల్ ట్రయల్ ని మాడ్రిడ్ మరియు బార్సిలోనా లో 5G స్మార్ట్ ఫోన్లను కనెక్ట్ చేయడానికి నిర్వహించింది మరియు దీన్ని నిర్విఘ్నంగా పూర్తి కూడా చేసినట్లు తెలిపింది.
అంతేకాకుండా, 5G కి అప్గ్రేడ్ అవడానికి యూరప్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది మరియు యూరప్ లోని ప్రధాన నగరాలలో ఈ సేవలు 2019 లోనే అందిచడానికి, ఈ టెలికం ఆపరేటర్ చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే, త్వరలోన్ యురేప్ లోని ప్రధాన నగరాలూ 5G నెట్వర్క్ కళను సంతరించుకుంటాయి.
ఈ ట్రయిల్ సమయంలో, ఈ సంవత్సరంలో విడుదల అవడానికి సిద్ధంగా వున్నాఒక 3 5G స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి, ఎటువంటి అంతరంలేకుండా చక్కని 5G నెట్వర్కుతో 4K వీడియో కాల్ చేసినట్లు కూడా చెబుతోంది. అంతేకాదు, ఈ 5G నెట్వర్క్ ప్రస్తుతం అందుబాటులో వున్నా 4G నెట్వర్క్ స్పీడు కంటే 10 రేట్లు వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్, బార్సిలోనాలో దాదాపుగా సెకనుకు 1.5GB (Gbps) డౌన్ లోడ్ స్పీడ్ చూపించినట్లు ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది.