జియోకి పోటీగా వోడాఫోన్ రూ.129 ప్రీపెయిడ్ ప్లానుతో, 28 రోజులు డైలీ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
వోడాఫోన్ ఈ ప్రీపెయిడ్ ప్లానుతో వినియోగదారులకి మంచి ప్రయోజనాలను అందిస్తోంది.
జియో నుండి వస్తున్నా పోటీని తట్టుకునేందుకు అన్ని ప్రధాన తెలికం కంపెనీలు కూడా ఒకేదాన్ని మించి ఒకటి పోటీపడి మరీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వివోడాఫోన్ కూడా తన వినియోగదారుల కోసం అత్యధిక ప్రయోజనాలను అందిచే ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. అదేమిటంటే, రూ.129 ప్రీపెయిడ్ ప్లాను ఈ ధరలో ఇది మంచి ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ రూ.129 ప్రీపెయిడ్ ప్లానుతో ఎటువంటి FUP పరిమితి లేనటువంటి లోకల్ మరియు STD అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. పైన తెలిపిన విధంగా, రోజువారీ 1.5 డేటా మరియు 28 రోజుల వ్యాలిడిటీకి గాను 2,800 sms లను కూడా అందిస్తోంది.అయితే,ఇక్కడ తెలిపిం 2,800 sms లు రోజుకు 100 sms పరిమితితో అందుతాయి.
ఆయితే, ఈ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం గుజరాత్, చెన్నై మరియు మరికొన్ని ఎంచబడిన కొన్ని వోడాఫోన్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో వుంది. కానీ, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను త్వరలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సహా అన్ని ప్రధాన సర్కిళ్లలో అందుబాటులోకి తెస్తుందని అంచనా వస్తున్నారు.
అయితే, ముందుగా ఇంచుమించు ఇటువంటి ప్రయోజనాలతో రూ. 119 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వోడాఫోన్ అందించింది. ఈ ప్లానుతో అన్లిమిటేడ్ కాలింగ్ మరియు రోజువారీ 1GB డేటా తో పాటుగా 28 రోజుల చెల్లుబాటుతో అందించింది. అంతేకాకుండా, రోజువారీ 100sms పరిమితితో పూర్తి చల్లుబాటు కాలానికి ఈ ప్రయోజనాన్ని వర్తింపచేసింది.
అలాగే , ఇటీవలి కాలంలో వోడాఫోన్ యొక్క ఈ మరొక రూ. 509 ప్రీపెయిడ్ ప్లానుపైన కూడా మార్పులు చేసింది ఎటువంటి FUP పరిమితిలేని లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్,రోజువారీ 1.4GB డేటా మరియు రోజువారీ 100SMS పరిమితితో పాటుగా 90 రోజుల వ్యాలిడిటీతో అందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించి, వినియోగదారులకి రోజువారీ 100MB డేటాని అధికంగా అఫర్ చేస్తోంది. అంటే, ఇప్పుడు ఈ ప్లానుతో రోజువారీ 1.5GB డేటాని అందుకుంటారు వినియోగదారులు.