మొబైల్ నెంబర్ యూజర్ల కోసం TRAI శుభవార్త.!
TRAI కొత్త ఆర్డర్ మొబైల్ నెంబర్ యూజర్లకు గొప్ప శుభవార్త అవుతుంది
15 కోట్ల మంది 2G యూజర్లకు మంచి మంచి ఉపయోగం చేకూరుతుంది
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకు రావాలని ట్రాయ్ ఆదేశించింది
TRAI కొత్త ఆర్డర్ మొబైల్ నెంబర్ యూజర్లకు గొప్ప శుభవార్త అవుతుంది. ఇప్పటి వరకు అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు కూడా కాలింగ్, డేటా మరియు SMS తో జతగా ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. అయితే, ఇక నుంచి అలా కాకుండా కాలింగ్ మరియు SMS లతో విడిగా ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ కొత్త ఆదేశం ద్వారా 15 కోట్ల మంది 2G యూజర్లకు మంచి మంచి ఉపయోగం చేకూరుతుంది.
ఏమిటా TRAI కొత్త ఆదేశం?
దేశంలో ప్రసుతం అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు కూడా అన్ని ప్రయోజనాలతో కూడా ప్లాన్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. అంటే, డేటా, కాలింగ్ మరియు SMS లతో జతగా ప్లాన్స్ మాత్రమే అందిస్తున్నాయి. అయితే, ఒకప్పుడు SMS మరియు కాలింగ్ కోసం కూడా విడిగా ప్లాన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా విధంగా కేవలం కాలింగ్ కోసం విడిగా, కేవలం SMS కోసం విడిగా మరియు ఈ రెండిటి జతగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకు రావాలని ట్రాయ్ ఆదేశించింది.
ఈ కొత్త ఆదేశంతో ఏమిటి ప్రయోజనం?
ట్రాయ్ యొక్క ఈ కొత్త ఆదేశంతో మొబైల్ నెంబర్ యూజర్లకు గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా, ఈ కొత్త ఆదేశం 2G యూజర్లకు గొప్ప వరం అవుతుంది. 5G వచ్చిన తర్వాత మరింతగా పెరిగిన టారిఫ్ రేట్లతో సతమవుతున్న యూజర్లకు ఇది గొప్ప గుడ్ న్యూస్ అవుతుంది. 2G మొబైల్ వాడుతున్న వారికి డేటా అవసరం లేకున్నా ప్రస్తుత ప్లాన్ లతో డేటాకి కూడా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అయితే, కొత్త ప్లాన్స్ వస్తే కేవలం కాలింగ్ లేదా SMS కోసం మాత్రమే వారు ప్లాన్స్ ఎంచుకోవచ్చు.
అంతేకాదు, Wi-Fi ఉపయోగిస్తున్న యూజర్లకు కూడా చాలా అనుకూలంగా ఈ ప్లాన్స్ ఉంటాయి. ఎందుకంటే, WiFi పై డేటా అందుతుంది కాబట్టి కేవలం కాలింగ్ లేదా SMS కోసం యూజర్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్ లలో పెను మార్పులు కలిగే అవకాశం ఉంటుంది మరియు యూజర్ కోరుకునే లేదా అవసరమైన సర్వీస్ కోసం మాత్రమే డబ్బు చెల్లించే అవకాశం దక్కుతుంది.
Also Read: LG New OLED: మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ లాంచ్: రేటు చూస్తే కళ్ళు తిరుగుతాయి.!
అయితే, యావరేజ్ రెవిన్యు పర్ యూజర్ (ARPU) ని పెంచడానికి వీలుగా కాలింగ్, SMS తో పాటు OTT బెనిఫిట్స్ జతగా ప్లాన్స్ అందించడానికి టెలికాం ఆపరేటర్లు చూస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి టెలికాం ఆపరేటర్లు తీసుకు రాబోతున్న కొత్త ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.