TRAI నుండి టెలికాం కంపెనీలకు కొత్త నోటిసులు వచ్చాయి. ఇక నుండి broadband కస్టమర్స్ కు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఎంత అనేది క్లియర్ గా తెలియజేయాలి…
అలాగే డేటా యొక్క usage లిమిట్ కూడా fixed line broadband వినియోగదారులకు తెలియాలి అని వెల్లడించింది ఇండియన్ టెలికాం అథారిటీ. ఆల్రెడీ తెలుపుతున్నారు.. కాని
ఈ విషయాలలో కస్టమర్స్ తో టెలికాం నెట్ వర్క్స్ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఉద్దేశించి చెప్పింది. మొబైల్ బ్రాడ్ బ్యాండ్(usb మోడెమ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేవి) providers కు కూడా ఈ విషయాలు వర్తిస్తున్నట్లు చెప్పింది.
కంపెనీల వెబ్ సైట్స్ లో ఇటువంటి సమాచారాన్ని వెబ్ సైట్స్ లో యాడ్స్ రూపంలో ప్రదర్శించమని సలహా ఇచ్చింది TRAI. మినిమమ్ డౌన్లోడ్ స్పీడ్ అనేది 512KBPS ఉండాలి అని కూడా ఆదేశించింది ఇంటర్నెట్ providers కు.