టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(TRAI) మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. అయితే, ఈ న్యూస్ కేవలం యూజర్లకు మాత్రమే గుడ్ న్యూస్, టెలికం కంపెనీలకు మాత్రం బ్యాడ్ న్యూస్. ఇపప్టి వరకూ కూడా జియో, Vi మరియు ఎయిర్టెల్ మూడు టెలికం కంపెనీలు కూడా నెల రోజుల రీఛార్జ్ అంటే కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పడు TRAI ఈ 28 రోజుల వ్యాలిడిటీ పైన కఠిన చర్లకు దిగింది మరియు 28 రోజుల ప్లాన్స్ ఇకపై పనిచేయవని కేంద్ర ఏజెన్సీ ప్రకటించింది. అంటే, Jio, Airtel మరియు Vodafone Idea అన్ని టెలికం కంపెనీలు కూడా పూర్తి నెల రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్‌ను అందించాలి.
TRAI చర్యల ఫలితంగా, ప్రస్తుత 28 రోజుల వ్యవధితో నడుస్తున్న ప్లాన్స్ కథ కంచికి చేరుతుంది. అంటే, రాబోయే కాలంలో అన్ని ప్లాన్‌లు కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. ఈ మేరకు ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది.
https://twitter.com/TRAI/status/1569305867773968387?ref_src=twsrc%5Etfw
ట్రాయ్ కొత్త విధానాల ప్రకారం, అన్ని టెలికం సంస్థలు కూడా ఈ నిభంధనలను పాటించ వలసి వస్తుంది. అంటే, కనీస వోచర్ మొదలుకొని ప్రత్యేక టారిఫ్ వోచర్ల వరకూ కూడా అన్ని ప్లాన్స్ కూడా 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉండాలి. అంటే, ఇక నుండి రీఛార్జ్ చేసే ప్లాన్ మళ్ళి తిరిగి అదే రోజున రీఛార్జ్ చేసుకునే విధంగా ఉండేలా టెలికం కంపెనీలు చూసుకోవాలి. టెలికం కంపెనీలు ఈ విధంగా తమ ప్లాన్స్ ను సరిచేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీ TRAI వారికి 60 రోజుల సమయం ఇచ్చింది.
మొబైల్ నంబర్ యూజర్ల నుండి వచ్చిన వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ టెలికాం టారిఫ్ ఆర్డర్‌ను పాటించాలని 2022 జనవరి ప్రారంభంలోనే TRAI ప్రకటించింది.