TRAI: సెప్టెంబర్ 1 నుంచి OTP ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం.. ఎందుకంటే.!
సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్ ప్రారంభం అవుతాయి
కొత్త రూల్స్ తో టెలికాం యూజర్లకు OTP ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం
స్పామ్ మెసేజ్ లను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నియమాలు ప్రవేశపెట్టింది
TRAI: సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ట్రాయ్ కొత్త రూల్స్ తో టెలికాం యూజర్లకు OTP ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్పామ్ మరియు ఫిషింగ్ మెసేజ్ లను నిలువరించడానికి ట్రాయ్ కొత్తగా తీసుకు వచ్చిన నియమాల ప్రకారం ఈ కొత్త ఇక్కట్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో బ్యాంక్, ఫైనాన్షియల్, ఈ కామర్స్ మరియు మరిన్ని ఇతర సర్వీసుల కోసం ఈ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ఏమిటా TRAI కొత్త రూల్స్?
ప్రజలు ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉన్న ఫిషింగ్, లింక్ మరియు కాల్ బ్యాక్ నెంబర్ కలిగిన స్పామ్ మెసేజ్ లను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నియమాలు ప్రాసెసపెట్టింది ప్రవేశపెట్టింది. కొత్త నియమాల ప్రకారం, టెలికాం కంపెనీలతో వైట్ లిస్ట్ చెయ్యని వారి నుంచి సెండ్ చేసే మెసేజ్ లలో URLs, APKs, OTT లింక్స్ లేదా కాల్ బ్యాక్ కలిగిన మెసేజ్ లను టెలికాం కంపెనీలు నివారించ వలసి ఉంటుంది.
అయితే, ఇప్పటి వరకు కేవలం హెడ్ లైన్ మరియు టామ్ప్లెట్స్ కోసం మాత్రమే టెలికాం కంపెనీలతో ఎన్ టైటిస్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, స్పామ్ మెసేజ్ లలో ఎక్కువగా చెక్ చేయాల్సిన మెసేజ్ ల కోసం ఎటువంటి మెకానిజం అందించలేదు. అయితే, సెప్టెంబర్ 1 నుంచి ఈ పద్ధతి మారుతుంది మరియు మెసేజ్ లో ఉన్న మేటర్ ను బట్టి పైన తెలిపిన విధంగా URLs, APKs, OTT లింక్స్ లేదా కాల్ బ్యాక్ ఉన్నట్లయితే ఆ మెసేజ్ లను రిసీవర్ కు రీచ్ అయ్యే అవకాశం ఉండదు.
Also Read: భారీ ఫీచర్స్ తో వచ్చిన Infinix Note 40 Pro 5G Racing Edition ఫస్ట్ సేల్ ఈరోజు మొదలవుతుంది.!
అయితే ఏమి జరుగుతుంది?
ఒకవేళ సరైన విధంగా మెసేజ్ రీడింగ్ మెకానిజం పని చేయక పొతే స్పామ్ తో వచ్చే ఇక్కట్ల కంటే OTP లేదా ఇతర బ్యాంక్ సర్వీస్ ల కోసం ఎదుర్కొనే ఇక్కట్లే ఎక్కువగా ఉంటాయి. అందుకే, టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కంపెనీలు దీనికోసం మరింత టైమ్ కోసం అభ్యర్థిస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.