టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అంతర్జాతీయ మొబైల్ రోమింగ్ సేవలకు సంబంధించిన నిబంధనలను మార్చింది. అంతర్జాతీయ మొబైల్ రోమింగ్‌ను డిఫాల్ట్ (అప్రమేయంగా) ప్రారంభించలేమని TRAI టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. ఈ సర్వీస్ కేవలం వినియోగదారు డిమాండ్ మేరకు మాత్రమే ప్రారంభించాలి అని కూడా తెలిపింది. అంటే, ఈ సర్వీస్ కోరుకుంటున్న యూజర్లకు మాత్రమే ఇవ్వాలని, లేకపోతే ఇవ్వకూడదని TRAI సూచించింది.
ఇక కొత్త రూల్ వచ్చిన వెంటనే, వినియోగదారులు ఈ సర్వీస్ తమకు కావాలని అభ్యర్థన చేసిన వారికీ మాత్రమే సర్వీస్. అలాగే, అవసరం లెనినప్పుడు ఒక్క మెసేజితో డే యాక్టివేట్ కూడా చేసుకునే వీలుంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన 30 రోజుల్లో ఈ షరతులను అమలు చేయాలి. దీని కోసం మే నెలలో ట్రాయ్ కన్సల్టేషన్ పేపర్ జారీ చేసింది.
TRAI నియమం ప్రకారం, అంతర్జాతీయ మొబైల్ రోమింగ్ ఎనేబుల్ చేసిన వెంటనే టెలికాం సంస్థలు వినియోగదారులకు ఆ విషయాన్ని తెలియజేయాలి. SMS, ఇ-మెయిల్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా సేవలను సక్రియం చేయడం మరియు వర్తించే టారిఫ్ చార్జీల గురించి వినియోగదారులలకు సమాచారాన్ని అందించాలి ఈ టారిఫ్ గురించి వినియోగదారులకు ఒక సారి లేదా పునరావృతమయ్యే సమాచారం ఇవ్వాలి. అంతర్జాతీయ రోమింగ్ పై బిల్ షాక్‌ను నివారించడానికి వినియోగదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ట్రాయ్ వివరిస్తుంది. మీరు మొబైల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను ఉపయోగిస్తుంటే మీరు బిల్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాయ్ చెప్పేది ఇదే.
రోమింగ్ ఛార్జీలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ట్రాయ్‌కు సమాచారం ఇచ్చాయి. ఇది నియంత్రించబడితే అది సర్వీస్ ను ప్రభావితం చేస్తుంది. టెలికాం కస్టమర్లను బిల్లు యొక్క కష్టాల నుండి కాపాడటానికి అంతర్జాతీయ రోమింగ్ పై ట్రాయ్ ఈ నిబంధనను జారీ చేసింది.