టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI), భారతీయ వినియోగదారులు వారి కంప్లైట్స్ రిజిష్టర్ చేయ్యడానికి వీలుగా, ఒక కొత్త APP మరియు పోర్టల్ ని లాంచ్ చేసింది. దీన్ని, కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టం(CMS) అని పిలుస్తోంది. ఇది వినియోగదారులు వారి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (VAS) కి సంభందించిన కంప్లైంట్స్ నమోదు చేయ్యడానికి సహాయపడుతుంది.
అంతేకాదు, ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టం(CMS) ద్వారా వినియోగదారులు తమ ఫోన్ పైన యాక్టివేట్ చెయ్యబడిన VAS వివరాలను కూడా పొందవచ్చు. మీ VAS కి సంబంధించి ఉభయ సమ్మతి గనుక TSP లు నమోదు చేయ్యకపోయినట్లయితే, వినియోగదారులు ఆ నెలకు సంభందించిన VAS ధరను క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఈ క్లెయిమ్స్, సంబంధిత TSP ల ద్వారా సెటిల్ చేయబడతాయి. అంటే, ఈ పనిని చేయడనికి, మీ కంప్లైంట్ నమోదు చెయ్యడానికి, మీకు ఈ TRAI CMS ఆప్లికేషన్ ఉపయోగపడుతుంది.
ఇక ఈ TRAI CMS ఆప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ App స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ పోర్టల్ కోసం ఈ https://cms.trai.gov.in/ URL ని ఎంచుకోవచ్చు.