కనీస రీచార్జి గురించి ప్రీపెయిడ్ చందాదారులకు స్పష్టంగా తెలియచేయాలని ఆదేశించిన TRAI

Updated on 29-Nov-2018
HIGHLIGHTS

ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ టెలీకోలు కనీస రీచార్జి అవసరాన్ని గురించి టెక్స్ట్ మెసేజిల ద్వారా తెలియచేయడం ప్రారంభించాయి.

ఉచిత సేవలతో,  రిలయన్స్ జియో టెలికాం రంగంలో ప్రవేశించిన తరువాత మిగిలిన టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వంటివి కూడా తక్కువ ధర ప్రీపెయిడ్ ప్రణాళికను, కొన్ని ఉచితసేవలు, వివిధరకాల కొత్త వ్యూహాలు మరియు వారి సేవలలో డిస్కౌంట్లను తీసుకువచ్చాయి. అయితే, ప్రస్తుతం  తక్కువ ఆదాయా సమస్యని ఎదుర్కొంటున్నాయి, ఫలితంగా ఇప్పుడు రాబడి పెంచడానికి వోడాఫోన్, ఐడియా మరియు ఎయిర్టెల్,  కొంతమంది  వినియోగదారులపైన కొత్త ప్రణాళికల ద్వారా భారం మోపనున్నాయి. మేము ముందుగా తెలిపినట్లు ఈ రెండు టెలికాం ఆపరేటర్లు వారి వినియోగదారులకు కనీస రీచార్జిని రూ 35 గా నిర్ణయించాయి మరియు లైఫ్ టైం వ్యాలిడిటీ SIM కనెక్షన్లను పరిమిత కాలానికి పరిమితం చేశాయి.      

ఎయిర్టెల్ ప్రకారం, వారి కనెక్షన్లను యాక్టివ్ గా ఉంచడానికి వినియోగదారులు కనీసం రూ.35 తో రీచార్జి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ, వినియోగదారులు అలాగనుక చేయకపోయినట్లయితే, వారి కనెక్షన్ ద్వారా కాల్స్ చేయలేని విధంగా నిరోధించబడతారు మరియు ఈ కనీస రీచార్జిని 15  రోజులలోపు చేయకపోతే, ఇన్కమింగ్ కాల్స్ కూడా నిలిపివేయబడతాయి. అయితే, వారి సిమ్ కార్డులో బ్యాలెన్స్ మిగిలి ఉంటే అది అలాగే ఉంచబడుతుంది మరియు ఒకవేళ మూడు నెలల వరకు కూడా ఈ కనీస రీచార్జి చేయనట్లయితే, ఈ కనెక్షన్లను నిలిపివేయకుండా ఉండడానికి మూడు నెలలకు ఒకసారి 20 రూపాయలను వారి సిమ్ నుండి తీసుకుంటుంది. ఈ సిమ్ కార్డులను నిలిపివేయడానికి ముందు 90రోజుల గడువును ఇచ్చాయి మరియు రూ. 35 కనీస రీచార్జి చేయడం ద్వారా ఎప్పుడైనా రి యాక్టివేట్  చేసుకోవచ్చు. ఈ రెండు టెలికాం సంస్థలు కూడా,  తమ వినియోగధారులకి ఈ కనీస రీచార్జి చేయడం గురించిన సమాచారాన్ని మెసేజీ ద్వారా తెలియచేస్తున్నట్లు చెప్పాయి.   

అయితే, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు తమ వినియోగదారులకి ఈ కనీస రీచార్జి మెసేజిలను పంపిన తరువాత, మూడురోజుల్లో ఈ కనీస రీచార్జి గురించి వినియోగదారులకి స్పష్టంగా తెలియచేయాలని TRAI నివేదిక రాసింది. మింట్ రిపోర్టు – " చందాదారుల కనీస రీఛార్జ్ ప్రణాళిక సహా అందుబాటులోవుండే ఎటువంటి  ప్రణాళికల కోసం ఎంచుకోవచ్చు మరియు ఇది ప్రస్తుతం ఉన్న పథకాన్ని, అలాగే ప్రస్తుత వ్యాలిడిటీ ముగించే  తేదీ వివరాలను ఒక స్పష్టమైన మరియు పారదర్శక పద్దతిలో మూడురోజులలో తెలియచేయాలని TRAI వివరణ కోరింది. ఈ నియంత్రణా సంస్థ టెలీకొలకు ఇలా రాసింది, "ఎవరైతే  వినియోగదారులు కనీస రీచార్జి మొత్తానికి సరిపడా బ్యాలెన్సును కలిగివుంటారో, అలాంటి వినియోగదారుల ఖాతాల సేవను నిలిపివేయరాదు."

ఎయిర్టెల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి, గోపాల్ విటల్,  ముందుగానే ఈ ప్రీపెయిడ్ రీఛార్జి అవసరాల గురించి మాట్లాడారు.  విట్టల్, కంపెనీ యొక్క నెట్వరులో330 మిలియన్ల వినియోగదారులను వున్నారు  అయినప్పటికీ, ఇక్కడ 10 కోట్ల మంది వినియోగదారులు    చాలా తక్కువ సగటు ఆదాయం (APPU) తో ఉన్నారని అన్నారు. అంతేకాకుండా, సంస్థ తయారుచేసిన మార్పులను పునరుద్ఘాటించారు మరియు పెరిగిన ARPU తో ప్యాక్లను పరిచయం చేశాడు, కనీస ARPU రూ.35

విట్టల్ ఈవిధంగా ప్రకటించారు, "ఇది కొన్ని మంచి ఫలితాలను ఇస్తున్నట్లు మేము చూశాము, ఇప్పుడు మేము ఈ దేశవ్యాప్తంగా దీనిని  అమలుచేయనున్నాము. నిజానికి, గత ఏడు రోజులలో, మేము ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాము, కనుక ఇప్పుడు టారీఫ్స్ చూస్తే  ఏడు లేదా ఎనిమిది టారీఫ్లను  మెరుగుపరిచాము. కనీస ARPU ప్రణాళికలు రూ.35 కాబట్టి ఇది మార్కెట్లో ఒక వైపు, తక్కువ ముగింపుతో ఉంది. "

ఈ టెలికో యొక్క ఈ చర్య ప్రధానంగా ఒక యూజర్ రీఛార్జ్ లో ప్రతి నెల కనీసం రూ 35 గడుపుతారు. ఇది వారి సాధారణ రీఛార్జిల నుండి వినియోగదారులకు అధిక ఆదాయాన్ని తెస్తుంది మరియు వారి కనెక్షన్లను డీయాక్టివేట్ చేయకుండా, కనీస మొత్తంతో నిర్వహించడం జరుగుతుంది. సెకండరీ మొబైల్ కనెక్షన్గా ఎయిర్టెల్ లేదా వొడాఫోన్ ఐడియా వాడటం వలన ఇది సర్వసాధారణం, ఇక్కడ సగటున నెలకు 35 రూపాయల కన్నా తక్కువకాకుండా రీఛార్జ్ చేస్తారు. ఈ రెండవ అనుసంధానం సాధారణంగా ఇన్కమింగ్ కాల్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు మరియు కేవలం రూ 10 యొక్క బేస్ రీఛార్జ్  ఈ కనెక్షన్ క్రియాశీలకంగా ఉండడాన్ని నిర్ధారిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :