TRAI బిగ్ న్యూస్: 30 రోజుల్లో 10 అంకెల మొబైల్ నంబర్స్ ఆపేందుకు నిర్ణయం.. ఎవరివంటే.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

10 అంకెల మొబైల్ నంబర్స్ ఆపేందుకు TRAI నిర్ణయం తీసుకుంది

మార్కెటింగ్ కంపెనీల ఆగడాలను కట్టడి చేసేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది

30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది

TRAI బిగ్ న్యూస్: 10 అంకెల మొబైల్ నంబర్స్ ఆపేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఈనిర్ణయం కేవలం 10 అంకెల మొబైల్ నంబర్స్ ఉపయోగించే టెలీ మార్కెటింగ్ కంపెనీల ఆగడాలను కట్టడి చేసేందుకు తీసుకున్నట్లు తెలిపింది. TRAI అనుమతి లేకుండా ప్రమోషనల్ కాలింగ్ మరియు మెసేజీల కోసం 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించే వినియోగదారులను టార్గెట్ చేసి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ చెబుతోంది. అసలు కథేమిటో తెలుసుకుందామా. 

వాస్తవానికి, టెలీ మార్కెటింగ్ కంపెనీలకు సాధారణ 10 మొబైల్ నంబర్ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే నంబర్స్ ను ఉపయోగిస్తాయి. ఎందుకంటే, టెలీ మార్కెటింగ్ కాల్స్ లేదా మెసేజీలు సాధరణ వినియోగదారుల నుండి భిన్నంగా మరియు అర్ధమయ్యేలా ఉండేదుకు ఇలా చేస్తారు. అయితే, చాలా టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఈ నియమాలను తుంగలో తొక్కి, వారి ఇష్టానుసారం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించి వారి ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది. 

ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

సాధరణ 10 అంకెల నంబర్ లతో యూజర్లను విసిగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీల పైన కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా, టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఆచరిస్తున్న ఈ అనైతిక పనులను TRAI పూర్తిగా కట్టడి చెయ్యాలని యోచిస్తోంది. ఇక ఎప్పటి నుండి ఇది అమలులోకి వస్తుంది? అని చూస్తే, రిజిష్టర్ చెయ్యకుండా ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ లను వెంటనే ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం, 30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :