వోడాఫోన్ మరియు ఐడియా విలీనం పూర్తయింది . ఈ రెండిటి కలయిక తరువాత “వోడాఫోన్ ఐడియా లిమిటెడ్” దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా మారింది

వోడాఫోన్ మరియు ఐడియా విలీనం పూర్తయింది . ఈ రెండిటి కలయిక తరువాత “వోడాఫోన్ ఐడియా లిమిటెడ్”  దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా మారింది
HIGHLIGHTS

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తో వున్నా అడ్డంకిని క్లియర్ చేసిన తరువాత ఈ రోజు వోడాఫోన్ - ఐడియా యొక్క విలీనాన్ని పూర్తి చేసింది.

వోడాఫోన్ ఇండియా మరియు ఐడియా సెల్యూలార్ విలీనం తరువాత మార్కెట్లో మొత్తం 32.2 శాతం రెవిన్యూ వాటా మరియు 408 మిలియన్ క్రియాశీల చందాదారులతో భారత దేశంలోఅతి పెద్ద టెలికామ్  సంస్థగా మారింది. ఇప్పటి వరకు ప్రధమ స్తానంలో ఉన్న ఎయిర్టెల్ ని ఆ స్తానం నుండి తోసి "వోడాఫోన్ ఐడియా లిమిటెడ్" ఇప్పడు ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది.

ఈ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ బోర్డు 12 మంది డైరెక్టర్లతో(6 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లతో కలిపి) ఉంటుంది మరియు దీనికి చైర్మన్ గా 'కుమార మంగళమ్ బిర్లా' ఉండనున్నారు. ఇంకా బాలేష్ శర్మ దీని CEO గా ఉండనున్నట్లు ఈ రెండు కంపెనీలు ఉమ్మడి ప్రకటన చేసాయి.దూకుడుతో వచ్చిన రిలయన్స్ జియోకి భారత మార్కెట్లో పోటీ ఇవ్వడానికి మాకు సత్తా ఉన్న టెలికామ్ గా ఉండనుంది అని అనిపిస్తుంది.

ఈ విలీనం వలన "అద్భుతమైన వాయిస్ మరియు బ్రాడ్ బ్యాండ్ కనెక్టవిటీ  దేశమంతటా విస్తరించగలం, దాదాపు 92 శాతం జనాభా మరియు 5,00,000 పట్టణాలు మరియు గ్రామాలకు చేరుతుందని" ఆదిత్య బిర్లా గ్రూప్ మరియు వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ యొక్క చైర్మన్ అయినటువంటి కుమార మంగళమ్ బిర్లా తెలిపారు. "అంతర్జాతీయ ప్రమాణాలు,ఖ్యాతిగల వోడాఫోన్ మరియు భారతీయ సంప్రదాయ ఐడియాల మేళవింపు (వోడాఫోన్ ఐడియా లిమిటెడ్) తో నిజంగాఈ రోజు చరిత్రలో నిలిచే రోజు" అని వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ సీఈవో అయిన బాలేష్ శర్మ తెలిపారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo