ఇపుడు వొడాఫోన్, రిలయన్స్ జీయో యొక్క దీపావళి ఆఫరు అయినటువంటి 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫరుకు, దాని సొంత లాభదాయకమైన ప్రణాళికలతో నేరుగా పోటీనిస్తోంది. వోడాఫోన్ చందాదారులకు ఈ రేచార్జీలపైనా 100% నగదును తిరిగి అందిస్తోంది, కానీ ఇది జియో ప్రణాళికవలనే, దేశవ్యాప్తంగా లేదు.
వోడాఫోన్ అప్లికేషన్ నుంచి రూ. 50 విలువగల వోచర్ల రూపంలో ఈ100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. కేవలం మూడు ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలు మాత్రమే ఈ ఆఫరుకు అర్హత కలిగి ఉన్నాయి – రూ. 399, రూ 458 మరియు రూ .509.
ఈ ప్రణాళికలు, అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ కాలింగ్ మరియు అపరిమిత రోమింగ్తో పాటు 100 SMSల రోజువారీ సదుపాయాన్ని అందిస్తాయి. ప్రతి ప్లాన్ కూడా 3G / 4G యొక్క 1.4GB డేటా అందిస్తుంది. వీటిన్నంటిలో వ్యత్యాసం కేవలం చెల్లుబాటుకాలం మాత్రమే. రూ. 399 పథకం 70 రోజుల కాలపరిమితిని కలిగి ఉంది. రూ .458 ప్లాన్ 84 రోజుల పాటు కొనసాగుతుంది. రూ. 504 ప్లాన్ 90 రోజులు చెల్లుతుంది.
100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫరుతో అందుకునే ఈ 50 రూపాయల వోచర్లతో, మరొక రీఛార్జిని చేయటానికి ఉపయోగించవచ్చు. ఈ రీచార్జ్ చేసిన ఫోన్ నంబర్ కోసం మాత్రమే రసీదును ఉపయోగించవచ్చు. మీరు మరొక నంబర్ రీఛార్జ్ చేయడానికి ఈ కూపను ఉపయోగించలేరు.
రు. 399 పథకం అన్ని సర్కిళ్లలో ఎనిమిది 50 రూపాయల వోచర్లను ఇస్తుంది. అయితే చెన్నై సర్కిల్లో రూ .509 రీఛార్జి ఉండదు. అలాగే, బీహార్, జార్ఖండ్ సర్కిళ్లకు రూ .409 పథకం ఉండదు. హిమాచల్ ప్రదేశ్ లోని వినియోగదారులకు రూ .509, 399 రీఛార్జి లభించవు. ఇంకా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, బీహార్ మరియు జార్ఖండ్ వంటి సర్కిళ్లలో 4G కవరేజ్ లేదు మరియు ప్రణాళిక ధర కూడా విభిన్నంగా ఉంటుంది.