TV పైన వచ్చే QR Code స్కాన్ తో టీవీ చానళ్లను ఎంచుకోవచ్చు : ఎయిర్టెల్ డిజిటల్ టీవీ

TV పైన వచ్చే QR Code స్కాన్ తో టీవీ చానళ్లను ఎంచుకోవచ్చు : ఎయిర్టెల్ డిజిటల్ టీవీ
HIGHLIGHTS

TRAI నిబంధనలకు అనుగుణంగా ఒక కొత్త పద్దతిని తీసుకొచ్చిన ఎయిర్టెల్ డిజిటల్ టీవీ.

DTH  ప్రొవైడర్లు అందరూ కూడా త్వరలో TRAI కొత్త నిబంధనలను అననుసరించవలసి వుంటుంది. దానికి అనుగుణంగా, ఎయిర్టెల్ తన డిజిటల్ టీవీ వినియోగదారులు ఛానల్ యొక్క ధరలను చూడగలరని ప్రకటించింది మరియు వాటిని a -la -carte  రీతిలో లేదా ప్రణాళికలలో ఎంపిక చేసుకోవచ్చు. మరిక విధంగా, వారి QR కోడ్ను తమ ఫోన్ ద్వారా స్కాన్ చేయగలరూ మరియు వాటిని ఎంచుకున్న ఛానెల్లతో ప్యాక్ని యాక్టివేట్ చేయడానికి 54325 కు పంపవచ్చు,

క్రింద అందించిన పూర్తి పత్రికా ప్రకటనను చదవండి

ఫిబ్రవరి 1, 2019 నుంచి టీవీ ఛానళ్ల  కోసం కొత్త TRAI ప్రైస్ రిజైమ్ అమల్లోకి రావడంతో, టీవీ వీక్షకులు ఇప్పుడు వారు చూడాలనుకుంటున్న ఛానళ్ల కోసం మాత్రమే డబ్బును చెల్లించవచ్చు.

వినియోగదారుల కోసం ఈ పద్దతిని సులభం చేయడానికి, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ గత నెలలో వెబ్సైట్లలో ఛానళ్ల లా-కార్ట్ ధరలను ప్రకటించింది. దీనిని  వినియోగదారులు, ఎయిర్టెల్ వెబ్సైట్లో లేదా మై ఎయిర్టెల్ App లో  లేదా కస్టమర్ కేర్ టీమ్ను సంప్రదించడం ద్వారా వారి ప్రణాళికలను సులభంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది.

ఈ మార్పును మరింత సౌకర్యవంతంగా మరియు తన వినియోగదారులకు ఆటంకం లేకుండాచేసే ఒక లక్ష్యంతో, ఎయిర్టెల్ ఇప్పుడు తమ అభిమాన ఛానళ్లను వారి టెలివిజన్ తెరపై కేవలం QR కోడ్ స్కాన్ తో  ఎంచుకోవడానికి వీలు కల్పిస్తోంది.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ఛానల్ నంబర్ 998 లో కొత్త TRAI మార్గదర్శకాల ప్రకారం వినియోగదారుడు వారి స్వంత ప్లాన్లను తయారు చేసుకోగలరు లేదా సిఫార్సు చేయబడిన ప్రణాళికల నుండి ఎంచుకోవచ్చు. అవును, అన్ని చానళ్లను మరియు వాటి ధరలను వీక్షించడం, వాటిని ఎంచుకుని చివరకు వారి ఎంపికను యాక్టివేట్ చేయడానికి కేవలం QR కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది,  ఇది చాలా సులభం.

వినియోగదారుడు వారి యొక్క లా-కార్ట్ ధరతో పాటు బ్రాడ్కాస్టర్ ప్యాక్లతో పూర్తి ఛానళ్ల జాబితాను చూడవచ్చు. వారు ప్రస్తుత ఛానల్ ఎంపిక లేదా ప్రస్తుత నెలసరి రీఛార్జ్ విలువ ఆధారంగా వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్టెల్ వేల్యూ ప్లాన్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు.

ఛానల్ లేదా ప్యాక్ ఎంపిక తరువాత, వినియోగదారులు కేవలం QR కోడ్ను స్కాన్ చేసి 54325 కు పంపడంతో, ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్యాక్ స్వయంచాలకంగా యాక్టివేట్ చేయబడుతుంది.

కోడును స్కాన్ చేయడానికి, వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగించాలి. వారి ఫోన్ కెమెరా QR స్కానర్కు మద్దతు ఇవ్వకపోతే, వినియోగదారులు ప్లేస్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి ఏదైనా ఉచిత QR స్కానర్ ఆప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు .

వినియోగదారులకు మరింత ఎక్కువ సౌలభ్యం కోసం, చానళ్ళు  మరియు ప్లాన్లను ఎన్నుకోవడాన్ని క్విక్ డెమోన్స్ట్రేషన్ వీడియో ఛానల్ 999 కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు కూడా www.airtel.in/digital-tv లేదా My Airtel App ద్వారా కూడా చానళ్లను లేదా వారి ఎంపిక ప్యాక్ ను  ఎంచుకోవచ్చు .

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo