ఇటీవల, వినియోగదారులకు మంచి ప్లాన్స్ అందించడంలో భారతి ఎయిర్టెల్ మంచి చొరవ చూపింది. ఎయిర్టెల్ వినియోగదారులకు అన్నివిధాలా ఉపయోగపడేలా కొన్ని ప్లాన్స్ ను ఇటీవల ప్రకటించింది. ఇవి వినియోగదారులకు కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజాలను మాత్రమే కాకుండా మరిన్ని ఇతర ప్రయోజనాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో ప్రవేశపెటింది. వాటిలో మీకు అధిక ప్రయోజనాలను అందించే ప్లాన్స్ గురించి ఈరోజు ఇక్కడ వివరిస్తున్నాను.
ఎయిర్టెల్ యొక్క ఈ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ ఎక్కువగా చేసేవారికి సరిపోతుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా మాత్రం ఉండదు. ఎందుకంటే, ఈప్లానుతో మీకు కేవలం 2GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈప్లానుతో వచ్చే SMS లు కూడా కేవలం 300 మాత్రమే. అయితే, ఈ ప్లాన్ ఇచ్చే మరొక బెనిఫిట్ క్రింద చూడండి.
ఇక ఈ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది మాత్రం ఉండదు. ఈప్లానుతో మీకు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 42GBడేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే బెనిఫిట్స్ క్రింద చూడండి.
ఇక ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఇది కూడా అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది. ఈప్లానుతో మీకు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 56GB డేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి.