BSNL యొక్క ఈ రెండు కొత్త ప్లాన్లతో మరింత డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలు

Updated on 15-Nov-2019
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) తన ఉనికిని సాటిచెప్పడానికి అనేకమైన ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చింది . కొన్ని నెలల క్రితం, రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ దాని భవిష్యత్తు గురించి, అనేక ఉహాగానాలు మరియు అనిశ్చితి లో ఓటమిని ఎదుర్కొనమే కానుండా, నష్టాల బాటలో నడుస్తోంది. ఏదేమైనా, ఈ టెలికాం ఆపరేటర్, ఇప్పుడు ప్రభుత్వం నుండి ఉపశమన ప్యాకేజీని అందుకుంది. అంటే, ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పుడు దాని కార్యకలాపాలను పునరుద్ధరిస్తుంది మరియు మెరుగైన 4G  నెట్‌ వర్క్‌ ను కూడా ఏర్పాటు చేస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల కోసం విఆర్‌ఎస్ ప్రక్రియ కూడా అమల్లోకి వచ్చింది, అంటే టెలికాం ఆపరేటర్‌కు ఆర్థిక ఉపశమనం కూడా కలిగింది.

అయితే, వీటన్నిటితో పాటు, బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్త ఆఫర్లు, ప్రీపెయిడ్ వోచర్లు మరియు ఇతర ఆఫర్లపై మరింతగా దృష్టి సారించింది. ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ మరియు బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌ తో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ప్రయత్నిస్తోంది. ఈ  కొత్త ఎత్తుగడలో భాగంగా, బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు రూ .97 మరియు రూ .365.

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభించిన రూ .97 ప్లాన్ STV అని గమనించాలి. మీరు ఉహించినట్లుగా, తక్కువ-విలువైన STV కావడంవలన, ఈ ప్రీపెయిడ్ వోచర్ కొన్ని రోజుల చెల్లుబాటు ఉన్నవారికి మంచిది. ఈ STV  ప్రయోజనాల విషయానికి వస్తే, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాల్స్ పొందుతారు. ఈ ప్రణాళిక యొక్క చెల్లుబాటు కాలం 18 రోజులు మాత్రమే ఉంటుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ 97 ఎస్‌టివిలతో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ ను కూడా విడుదల చేసింది, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ .365. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాల కాల్స్ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కాబట్టి, ఈ ప్లాన్ 60 రోజుల ఉచిత చెల్లుబాటు ఉంటుంది, అయితే ఈ ప్లాన్  యొక్క చెల్లుబాటు ఒక సంవత్సరం అవుతుంది. అంటే చందాదారులు రోజుకు 2 జీబీ డేటాను 60 రోజులు ఉపయోగించుకోగలుగుతారు. తమిళనాడు, చెన్నై, కేరళ మరియు ఇతర సర్కిళ్లలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఈ రెండు ప్లాన్లకు సభ్యత్వాన్ని పొందగలరు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :