టెలికం కంపెనీలు వినియోగదారుల పైన మరింత భారాన్ని మోపడానికి సిద్ధమవుతున్నట్లు ఆర్ధిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది. టెలికం కంపెనీలు వచ్చే ఏడాది నుండి ఈ భారాన్ని మోపే ఆలోచనలో ఉన్నట్లు జెఫెరీస్ పేర్కొంది. 5G సర్వీస్ లను లాంచ్ చెయ్యడం, నంబర్ పోర్టబిలిటీ ద్వారా వినియోగదారుల వలసలు, పెరుగుతున్న వ్యయం మరియు టెలికం సంస్థల మద్య కొనసాగుతున్న అధిక పోటీతో కంపెనీలు ఈవిధంగా చర్యలు తీసుకొనున్నట్లు జెఫెరీస్ సూచించింది.
వాస్తవానికి, యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ARPU), అంటే వినియోగదారుడి పై వచ్చే సగటు ఆదాయం తగ్గండం వంటివి ప్రధాన కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే, జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు వచ్చే ఏడాది టారిఫ్ ఛార్జ్ లు పెరుగుతాయని తేల్చి చెప్పేశాయి. అయితే, ఎంత వరకూ పెంచివచ్చనేది వేచిచూడాల్సిందే. అయితే, గత ఏడాది పెంచిన టారిఫ్ ఛార్జ్ లతో పోలిస్తే వచ్చే ఏడాది ఎక్కువగ ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది గరిష్టంగా 10 శాతం వరకూ పెంచే అవకాశం ఉండవచ్చని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే, వినియోగదారుల రీఛార్జ్ రేట్లు మరింతగా పెరిగిపోతాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ రేట్లతో సతమతమవుతున్న యూజర్లు మరింత భారం మోయవలసి వస్తుంది. అయితే, టారిఫ్ రేట్లు ఎంత వరకూ ఎరిగేది తెలియాలంటే, వేచిచూడాల్సిందే.