500 Mbps తో 4G డౌన్లోడ్ స్పీడ్ : త్వరలో ఎయిర్టెల్ చందాదారులు అందుకోవచ్చు

Updated on 12-Feb-2019
HIGHLIGHTS

ఎయిర్టెల్ తన వినియోగదారులకి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అందిచడంలో ముందుంటుంది.

అతిత్వరలో భారతి ఎయిర్టెల్ వినియోగదారులు 500Mbps వేగంతో డేటాను 4G నెట్ వర్క్ పైన అందుకునే  అవకాశాన్ని కంపెనీ అందించనున్నట్లు అనిపిస్తోంది. దేశంలో, ఈ తేలికోసంస్థ అత్యంత వేగాన్ని అందించడానికి సరికొత్త సాంకేతికతను సిద్ధంచేస్తోంది.  భారత దేశంలో, మొదటిసారిగా ఎయిర్టెల్ మరియు స్వీడన్ యొక్క ఎరిక్సన్ తో కలిసి ఒక లైసెన్సుడ్ అసిస్టెడ్ యాక్సెస్ (LAA) యొక్క లైవ్ LTE మొదటి ట్రయల్ ని ఈ శుక్రవారం చేపట్టింది. 

ET ప్రకారం, ఎయిర్టెల్  సెకనుకు ఒక GB స్పీడ్ అందించడం కోసం తయారుచేస్తున్న 5G నెట్ వర్కులో భాగంగా ఈ సరికొత్త డెవలప్మెంట్ మనముందుకొచ్చింది. ఈ ట్రయల్  సమయంలో, అంతర్గత వాతావరనంలో ఒక 500Mbps కంటే అధికమైన స్పీడు స్మార్ట్ ఫోనులో నమోదయ్యింది, మరియు సిగ్నల్ స్టేషనుకు 180 దూరంలో బాహ్య వాతావరణంలో దాదాపుగా 400Mbps కంటే అధికమైన స్పీడు స్మార్ట్ ఫోనులో డౌన్లోడింగ్ స్పీడ్ నమోదయినట్లు, ఈ టెలికం సంస్థ తెలిపింది .                                                             

"ఎయిర్టెల్ తన వినియోగదారులకి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అందిచడంలో ముందుంటుంది. 5G మరియు గిగాబైట్స్ సాధించడం కోసం ఎరిక్సన్ భాగస్వామ్యంతో ఇండియాలో మొట్టమొదటి LAA ట్రయల్ ని నిర్వహింహడం మాకు సంతోషంగా వుంది.  ఈ LAA సాంకేతికత అనేది నిజమైన 4G స్పీడును తీసుకువస్తుంది" అని, భారతి ఎయిర్టెల్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి రణదీప్ సేఖాన్ ఒక స్టేట్మెంటులో తెలిపారు.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :