BSNL నెట్ వర్క్ కోసం మీ మొబైల్ నంబర్ మార్చుకోవాలి అకుంటున్నారా..!!
BSNL కి మీ మొబైల్ నంబర్ ను సింపుల్ గా పోర్ట్ చేసుకోవచ్చు
ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు
తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న BSNL
చాలా చవక ధరకే అధిక లాభాలను అందిస్తున్న టెలికం సంస్థగా పేరుపొందిన BSNL కి మీ మొబైల్ నంబర్ ను మార్చుకోవాలి అకుంటున్నారా. దీనికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా పోర్ట్ చేసుకోవచ్చు. వాస్తవానికి, ఆశించిన స్థాయిలో సిగ్నల్ మరియు ఇంటర్నెట్ ను పొందలేక పోతున్నట్లు BSNL కస్టమర్లు చెబుతుంటారు. అయితే, ఇది అన్ని ప్రాంతాలకుఒకేవిదంగా ఉండకపోవచ్చు లేదా వర్తించక పోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న BSNL నెట్ వర్క్ కు మారాలనుకుంటే, ఈ క్రింద సూచించిన విధంగా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు.
మీ సిమ్ కార్డ్ ను BSNL కు ఎలా పోర్ట్ చేయాలి?
మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు.
అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించ వాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.