Samsung Galaxy S24 Ultra 5G ఫోన్ కాదు AI అద్భుతం.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.!

Updated on 18-Jan-2024
HIGHLIGHTS

Samsung Galaxy S24 Ultra 5G ముందెన్నడూ చూడనటువంటి గొప్ప ఫీచర్లతో వచ్చింది

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ కాదు AI అద్భుతం

నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ తో వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24

శామ్సంగ్ చాలా కాలంగా విపరీతంగా టీజింగ్ చేస్తున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఎస్24 ఈరోజు అట్టహాసంగా లాంచ్ చెయ్యబడింది.ఈ సిరీస్ లో అత్యంత ప్రీమియం ఫోన్ అయిన Samsung Galaxy S24 Ultra 5G, ముందెన్నడూ చూడనటువంటి గొప్ప ఫీచర్లతో వచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ కాదు AI అద్భుతం, అని సింపుల్ గా చెప్పొచ్చు. ఈ ఫోన్ లో AI ఫీచర్స్ మొదలు కొని AI Camera ఫీచర్స్ వరకూ అన్ని ఫీచర్లు కూడా ఈ ఫోన్ ను నెక్ట్స్ లెవల్ అనిపించేలా చేశాయి.

Samsung Galaxy S24 Ultra 5G

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జి స్మార్ట్ ఫోన్ QHD+ (3120 x 1440) రిజల్యూషన్ అందించ గల 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే గరిష్టంగా 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లేలో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. ఈ ప్రీమియం ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ఫాస్ట్ ప్రోసెసర్ తో లంచ్ చేసింది. దీనికి జతగా 12GB RAM మరియు 1TB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా జత చేసింది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జి ఫోన్ కాదు ఒక AI అద్భుతం అనడానికి దారి తీసిన ఫీచర్స్ దీని AI కేపబిలిటీస్. ఈ ఫోన్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నెక్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ ఫోన్ లో Live Translate మరియు ఇందులో ఉన్న యాప్ ద్వారా రియల్ టైమ్ వాయిస్ కాల్ ట్రాన్స్ లేషన్ నిజంగా అద్భుతం పని చేస్తుంది. ఇది కాకుండా, చాట్ ఆసిస్టెంట్, సర్కిల్ టూ సెర్చ్, AI నోట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ కెమేరా సెటప్ మరింత అద్భుతం అనిపించేలా వుంది. ఇందులో, 200MP వైడ్ యాంగిల్ + 12MP అల్ట్రా వైడ్ + 50MP (5x ఆప్టికల్ జూమ్) + 10MP (3x ఆప్టికల్ జూమ్) కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరాతో 10X వరకూ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ తో అద్భుతమైన క్లారిటీతో ఫోటోలను మరియు 30fps వద్ద UHD 8K (7680 x 4320) వీడియోలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

దీనికి తోడు ఇందులో అందించిన AI Zoom వివరాలను మరింతగా పెంచుతుందని కూడా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కెమేరాతో జత చేసిన Galaxy AI కెమేరా టూల్స్ ఫోటోలు మరియు వీడియోలను ఎడిట్ చేసే విధంగా ఎడిట్ చేసే సలహాలను కూడా అందిస్తాయి. ఈ ఫోలే లో S Pen Stylus తో ఎడిట్ ను మరింత సులభంగా మారుస్తుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ మరియు వైర్ లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వుంది.

Also Read : Jio Republic Day Offer 2024: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో.!

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జి ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జి బేసిక్ వేరియంట్ (12GB + 256GB) రూ. 1,29,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క (12GB + 512GB) వేరియంట్ ను రూ. 1,39,999 ధరతో మరియు (12GB + 1TB) రూ. 1,59,999 ధరతో లాంచ్ చేసింది.

అయితే, శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జి ఫోన్ తో లాంచ్ గొప్ప లాంచ్ అఫర్ లను కూడా అందించింది. HDFC బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 5,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ మరియు పాత ఫోన్ ఎక్స్ Exchange పైన రూ. 5,000 రూపాయల అధనపు Bonus ను ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :