రిలయన్స్ జియో vs BSNL

Updated on 04-Jan-2019
HIGHLIGHTS

జియో తరువాత రోజువారీ ఉచిత డేటాని అందిస్తున్న ఏకైక టెలికం కంపెనీ BSNL మాత్రమే.

రిలయన్స్ జియో, ఎంట్రీతోనే ఉచిత డేటాని అందిస్తూ అన్ని టెలికం కంపెనీలకు  షాకిచ్చింది. తరువాత, ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL),  తన కొత్త ప్రకటనతో మిగిలిన అన్ని టెలికాం సంస్థలకు షాకిచ్చింది. ప్రస్తుతం, తన 7 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.21GB డేటా ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లానులన్నింటికీ కూడా ఈ అఫర్, 31 జనవరి 2019 వరకు అందుబాటులో ఉంటుంది.                      

Rs 186 ప్లాన్ – ముందుగా రోజువారీ 1GB ఇస్తుండగా, దీని పైన 2.21GB డేటాని ఉచితంగా ఇస్తోంది.మొత్తంగా, ఈ ప్లానుతో, ఇపుడు  రోజువారీ 3.21GB మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) ఇంకా 28 రోజుల వ్యాలిడిటీతో ఇస్తోంది. 

అంతేకాకుండా, తన 7 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.21GB అధిక డేటాని  ఉచితంగా అందిస్తోంది.  BSNL యొక్క ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి, Rs 186, Rs 429,Rs 485,Rs 666, Rs 999, మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్ అయినటువంటి Rs 1699 మరియు Rs 2099 పైన కూడా ఈ 2.21GB రోజువారీ అధిక డేటాని వర్తింపచేసింది.  ముఖ్యంగా, BSNL యొక్క వార్షిక ప్రణాళికలైన Rs. 1699 మరియు 2099 లకి కూడా ఈ రోజువారీ 2.21GB ని ముందు నుండే వర్తింపు చేసింది. ముణుడుగా నవంబరు 14 వ తేదీతో ఈ ప్రణాళికలు ముగుస్తుందని ప్రకటించినా, వీటిపైన వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ వార్షిక ప్రణాళికలను జనవరి 2019 వరకు అందుబాటులో ఉంచింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :