రిలయన్స్ జియో : డిసెంబర్ 2018 త్రైమాసికంలో నికర లాభం 65% పెరిగి 831 కోట్లకు చేరుకుంది

Updated on 18-Jan-2019
HIGHLIGHTS

డిసెంబరు 2017 లో కంపెనీ కస్టమర్ బేస్ రూ .16 కోట్ల గ ఉండగా ,ఇది డిసెంబర్ 2018 నాటికి 28 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ జీయో తన చందాదారులలో ఉత్తమమైన ఆఫర్లు మరియు సరసమైన ప్రణాళికల కారణంగా ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందింది. ఇతర టెలికాం ఆపరేటర్లు ఈ సంస్థతో పోటీ పడటానికి కొత్త ప్రణాళికలను తీసుకొచ్చారు మరియు కొన్నిసార్లు ఇప్పటికే ఉన్న ప్రణాళికలలో చాల మార్పులు కూడా చేశారు. ఇటీవలే, రిలయన్స్ జీయో దాని డిసెంబర్ 2018 క్వార్టర్ ఫలితాలను సమర్పించింది. ఈ 2018 చివరి త్రైమాసికంలో, ఈ యొక్క సంస్థ నికర లాభం 65% తో 831 కోట్లకు పెరిగింది. వినియోగదారుల పెరుగుదల కారణంగ కంపెనీ యొక్క లాభాలలో  కూడా పెరుగుదల చోటుచేసుకుంది. ఈ డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ .681 కోట్ల లాభాన్ని ఆర్జించింది. డిసెంబరు 2017 లో కంపెనీ కస్టమర్ బేస్ రూ .16 కోట్ల గ ఉండగా ,ఇది డిసెంబర్ 2018 నాటికి 28 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా, ఇటీవలే రిలయన్స్ జియో ఎనిమిది భారతీయ భాషలతో కొత్త బ్రౌజర్ అప్లికేషన్ను కూడా విడుదల చేసింది

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, "రిలయన్స్ జీయో కుటుంభంలో చేరినవారు ఇప్పుడు, 28 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరగడం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము". రిలయన్స్ జియో రెండు సంవత్సరాలలో కొత్త మరియు పెద్ద రికార్డును సృష్టించింది.

రిలయన్స్ జీయో ఆపరేటింగ్ రెవెన్యూ గురించి మాట్లాడితే,  అక్టోబర్ 2018 నాటికి ఇది 50.9 శాతం వరకు పెరిగింది మరియు ఇది 10,383 కు చేరింది. 2017 లో ఈ సంఖ్య రూ .6,879 కోట్లుగా వుంది. ఈ నవంబరులో, జియో యొక్క సగటు డౌన్లోడ్ వేగం 20.3MBps. ఇటీవలే, ఇతర టెలికాం సంస్థలతో పోల్చితే, రిలయన్స్ జియో యొక్క డౌన్ లోడ్ వేగాగం మెరుగ్గా ఉందని ట్రాయ్ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :