Reliance Jio యూజర్లకు Netflix Free Subscription కొత్త ప్లాన్ ను అందించింది. రిలయన్స్ జియో యొక్క ఈ New Plan ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు మరిన్ని లాభాలను అందిస్తోంది. రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన ఈ లేటెస్ట్ ధమాకా ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం.
రిలయన్స్ కొత్తగా తీసుకు వచ్చిన కొత్త రూ. 1,099 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Also Read : Vivo v29 Pro Launched: Sony ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరాతో లాంచ్ అయ్యింది| New Phone
రిలయన్స్ యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,099 ధరలో వస్తుంది. ఈ జియో ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని, డైలీ 2GB హై స్పీడ్ డేటా చొప్పున 84 రోజులకు గాను టోటల్ 168 GB హై స్పీడ్ డేటాని తీసుకు వస్తుంది. ఈ అన్లిమిటెడ్ ప్లాన్ తో 100 SMS/day ప్రయోజనంతో కూడా అందుతుంది.
ఈ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ OTT మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు, 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ఏరియాలలో ఎలిజిబుల్ యూజర్లకు Unlimited 5G data ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో జియో Cinema, జియో Tv మరియు జియో Cloud వంటి జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
ఒకవేళ మీరు డైలీ ఎక్కువ డేటాని కోరుకుంటే మీకు మరొక ప్లాన్ అందుబాటులో వుంది. అదే, రిలయన్స్ యొక్క యొక్క రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ రూ. 1,099 ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. అయితే, ఈ రెండు ప్లాన్స్ లో తేడా ఏమిటంటే, ఈ ప్లాన్ రోజుకు 3GB హాయ్ స్పీడ్ డేటా చొప్పున 84 రోజులకు గాను టోటల్ 252GB ల హాయ్ స్పీడ్ డేటాని అందిస్తుంది. Check Offers Here