హ్యాపీ న్యూ ఇయర్ 2021 వస్తూనే జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. గత సెప్టెంబర్ నుండి రిలయన్స్ జియో అనుసరిస్తున్న ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ లేదా IUC ని ముగించింది. కాబట్టి, ఇక నుండి అంటే జనవరి 1, 2021 నుండి అన్ని నెట్వర్కులకు కూడా ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని జియో కస్టమర్లకు అందించింది.
వాస్తవానికి, అందరికి కంటే ముందుగా ఉచిత 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని జియో తన కస్టమర్లకు అందించింది. కానీ, గత సంవత్సరం TRAI నియమాలను అనుసరించి సెప్టెంబర్ నుండి ఇతర నెట్వర్క్ నంబర్ లకు చేసే కాలింగ్ కోసం అధనపు డబ్బును చెల్లించే విధంగా తన ప్లాన్లను మార్పు చేసింది. అయితే, ఈరోజు నుండి అన్ని నెట్వరలకు అన్లిమిటెడ్ ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు.
ఇదే విషయాన్ని జియో తన జియో తన మాటల్లో చెబుతూ, జియో కస్టమర్లకు జియో నెట్వర్క్ నుండి ఆన్-నెట్ డొమెస్టిక్ కాల్స్ ఎల్లప్పుడూ ఉచితంగా తెలిపింది.
అంటే, ఇక ఉంది తమకు నచ్చిన ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే జియో వినియోగదారులు జియో నుండి జియో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర నెటవర్క్ లకు ఉచిత ఆన్-నెట్ కాలింగ్ మినిట్స్ అనికాకుండా, అన్ని నెట్వర్కులకు ఉచిత కాలింగ్ అందుకుంటారు.
లేటెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్స్ కోసం Click Here