జియో 5G అఫర్: రూ.61 రూపాయలకే 5G లాభాలను అందించే బెస్ట్ అఫర్.!

Updated on 24-Jan-2023
HIGHLIGHTS

రూ.61 రూపాయలకే 5G లాభాలను అందించే బెస్ట్ అఫర్

తెలుగు రాష్ట్రాలలో 13 నాగరాల్లో Jio True 5G సర్వీస్ లను అందుకున్న కస్టమర్లు

ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.

జియో 5G అఫర్: రూ.61 రూపాయలకే 5G లాభాలను అందించే బెస్ట్ అఫర్ తన కస్టమర్ల కోసం రిలయన్స్ జియో అందించింది. శరవేగంగా తన 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న జియో, ఈ 5G ప్రయోజనాలను అందించే ఒక అఫర్ ను కూడా అందించింది. ఇప్పటికే  మన తెలుగు రాష్ట్రాలలో 13 నగరాల్లో Jio True 5G సర్వీస్ లను అందుకున్న కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.  

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 5G స్పీడ్ తో డేటాని పొందవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు మరియు ఏ ప్లాన్ లతో పాటుగా ఈ 5G అప్గ్రేడ్ ప్లాన్ వర్తిస్తుందో తెలుసుకోండి. 

వాస్తవానికి, మీరు ఉపయోగిస్తున్న 4G సిమ్ కార్డ్ తోనే మీరు 5G సర్వీసులను పొందవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్స్ పైనే 5G సేవలను ఉపయోగించుకోవచ్చని కూడా పేర్కొంది. అయితే, ఇటీవలే, రిలయన్స్ జియో కొత్త Jio 5G Upgrade Plan ను యూజర్ల కోసం అందించింది.

Jio 5G Upgrade Plan:

జియో ప్రకారం, ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కేవలం రూ.61 రూపాయలకే లభిస్తుంది. ఈ పాన్ తో మీకు 6GB అన్లిమిటెడ్ 5G డేటా అందుతుంది. ఈ డేటా ఎటువంటి ఉపయోగానికి లిమిట్ లేదు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ కాలం వరకూ ఈ డేటాని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇది ఏ ప్రాంతాల్లో అయితే Jio 5G సర్వీస్ అందుబాటులో ఉన్నదో వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇప్పటి వరకూ True Jio 5G లాంచ్ చేయబడిందో, ఆ సిటీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే యాడ్ ఆన్ గా జతచేసే వీలుంది. జియో తెలిపిన ప్రకారం, రూ.119, రూ.149, రూ.179, రూ.199 మరియు రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే ఈ జియో Jio 5G Upgrade Plan యాడ్ ఆన్ గా రీచార్జ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :