ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, మనం సర్వసాధారణంగా eKYC గా పిలిచే దీనిని 12 అంకెల UID నంబర్, వినియోగదారుని యొక్క బయోమెట్రిక్ తో చేయబడుతుంది. అయితే, సుప్రీమ్ కోర్టు దీని పైన కొన్ని ఆంక్షలను విధించింది, తద్వారా టెలికామ్ కంపెనీలు ఈ విధానము ద్వారా KYC నమోదు చేయడాన్ని నిలిపి వేయాల్సి ఉంటుంది. కానీ, DOT నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు eKYC మార్గాన్నే అనుసరిస్తామని జియో వెల్లడించింది.
" DOT యొక్క ఆదేశాల మేరకు UIDI నుండి కాకుండా KYC నమోదుచేయడం కోసం మా ఇతర మార్గాలను DOT కి సమర్పించాము. ప్రస్తుతం, మేము DOT యొక్క తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు eKYC కొనసాగిస్తామని" స్ట్రాటజీ మరియు ప్లానింగ్ ప్రధానాధికారైన, అన్షుమన్ ఠాకూర్ తెలిపారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకారంగా, ఈ ఆధార్ ఎగ్జిట్ ప్లాన్లను అక్టోబర్ 15 వరకు అన్ని టెలికామ్ కంపెనీలు కూడా సమర్పించాయి. అయితే, ఆధార్ eKYC చాల తేలికైనది మరియు సులభమైన పద్దతి కావడంతో దీనిని వినియోగించడం టెలికామ్ కంపెనీలకు సులభంగా ఉంటుంది. కానీ ప్రస్తుత ఆధార్ సెక్యూరిటీ సంక్షోభ పరిస్థితుల్లో, ఇటువంటి కొన్ని కీలక విధానాలను పాటించవలసి ఉంటుంది.