టాటా స్కై తన Tata Sky Binge+ సర్వీస్ ఇప్పుడు ZEE5 నుండి కూడా కంటెంట్‌ను అందిస్తుందని ప్రకటించింది. ZEE5 ప్లాట్‌ఫాం 12 భాషల్లో 125,000 గంటలకు పైగా కంటెంట్‌ను అందిస్తుందని చెప్పబడింది. టాటా స్కై బింజ్ + సర్వీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ ప్రీమియం, SunNext మరియు మరిన్ని ప్లాట్ ఫారమ్స్ నుండి కంటెంట్‌ను అందిస్తుంది.
టాటా స్కై ఇప్పటికే, ప్రముఖమైన OTT తో సర్వీస్ అందిస్తూ వినియోగదారుల ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ యంపికలను ఇస్తుండగా, టాటా స్కై బింజ్ + ద్వారా ఎంటర్టైన్మెంట్ సూపర్-యాప్ ఆఫ్ ఇండియా, ZEE 5 తో తన భాగస్వామ్యాన్ని విస్తరించడంతో, ఆండ్రాయిడ్ ఎనేబుల్ స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ తో లైవ్ టెలివిజన్ మరియు హోస్ట్ టీవీలో OTT యాప్స్ మరింతగా విస్తరించింది.
మొత్తం కుటుంబానికి స్మార్ట్ మరియు అంతులేని వినోదాన్ని అందించడానికి రూపొందించబడిన టాటా స్కై బింజ్ + ఇప్పుడు తన చందాదారులకు ZEE5 ద్వారా విస్తారమైన బాలీవుడ్ మరియు బహుభాషా(మల్టి లాంగ్వాజ్) చిత్రాలతో మరియు 12 భాషలలో 125,000+ గంటలకు పైగా విస్తరించి ఉన్న ఒరిజినల్ కంటెంట్ అందిస్తుంది. ఇందులో, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం , తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ వంటి బాషలు వున్నాయి. ఇది ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న- అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, SUN Next, హంగమా ప్లే, ErosNow మరియు ShemarooMe తో పాటుగా వచ్చి ZEE5 చేరుతుంది.
ఇక టాటా స్కై బింజ్ + విషయానికి వస్తే, ఇది అనేక అధునాతన ఫీచర్ల సమాహారంతో వస్తుంది. ఇది ప్రేక్షకులు వారి ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ వంటి వాటిలో ఏదైనా కార్యక్రమాలు , చలనచిత్రలు, మ్యూజిక్ , గేమ్స్ ఆడటానికి మరియు దాని అంతర్నిర్మిత Chromecast తో నేరుగా వారి టీవీలో చూడటానికి వీలు కల్పిస్తుంది. ఇది వాయిస్ సెర్చ్ తో కంటెంట్‌ను వెతకడానికి వీలుగా గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది. ఇది 4 K , HD ఎల్‌ఇడి, LCD లేదా ప్లాస్మా టెక్నాలజీతో సహా అన్ని రకాల టివిలకు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇది HDMI అవుట్‌పుట్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఆడియో మరియు వీడియో కేబుల్ ద్వారా పాత టివి సెట్‌లకు కూడా కనెక్ట్ చేయవచ్చు.