ఇప్పుడు కేవలం 2 రోజుల్లో MNP (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ) చేసుకోవచ్చు

Updated on 20-Dec-2018
HIGHLIGHTS

TRAI ఒకే టెలికాం సర్కిలకు చెందిన పోర్ట్ అభ్యర్థనలను కేవలం 2 రోజులకు సవరించింది.

టెలికం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (TRAI),  ఒక టెలికాం ఆపరేటర్ నుండి మరోదానికి మారడానికి ఉపయోగించే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(MNP)  యొక్క విధానాన్ని సడలించింది. TRAI కొత్త MNP అభ్యర్ధనలను పూర్తి చేయడానికి కొత్త సమయపాలనను ఏర్పాటు చేసింది మరియు ముందుగా 7 రోజుల సమయం తీసుకునే ప్రక్రియను ఒకే టెలికాం సర్కిళ్ళకు చెందిన పోర్ట్ అభ్యర్థనలను కేవలం 2 రోజులకు సవరించింది. ఒక సర్కిల్ నుండి వేరొక సర్కిల్ కు  పోర్ట్ చేయాలనే అభ్యర్ధనలకు, ముందుగా వున్నా15 రోజుల కాలవ్యవధి నుండి 4 పని రోజులకు కుందించింది.

అయితే, కార్పొరేట్ మొబైల్ కనెక్షన్ల కొరకు పోర్టింగ్ అభ్యర్ధనలను పూర్తి చేయడానికి కాలపరిమితి కూడా 4 రోజులకు సెట్ చేయబడుతుంది. జమ్మూ & కాశ్మీర్, అస్సాం మరియు నార్త్ ఈస్ట్ మినహా, ఈ కొత్త సమయపాలనలు  జాతీయస్థాయిలో విస్తరణను కలిగి ఉంది.

ఒక కొత్త వ్యవస్థ ద్వారా MNP అభ్యర్ధనలను వేగవంతంగా పూర్తి చేయడానికి TRAI ఆపాదించింది, దీని ద్వారా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సర్వీస్ ప్రొవైడర్, దాత ఆపరేటర్ యొక్క డేటాబేసులో రియల్ టైం ప్రాతిపదికన రూపొందించిన ప్రత్యేక పోర్టింగ్ సంకేతాలను స్కాన్ చేస్తుంది. MNSP అప్పుడు టెలీకోకు ప్రత్యేక పోర్టింగ్ కోడ్ను ముందుకు తీసుకెళ్తుంది, ఇది కొత్త కస్టమరుకు అవసరమైనది.

ఇప్పుడు ఈ ప్రక్రియ ఆటోమేటెడ్ అయినందున, నంబర్ పోర్టింగ్ అభ్యర్థనలను పూర్తి చేయడానికి సమయం రెండు రోజులకు తగ్గించబడింది. ట్రాయ్ కూడా జమ్మూ & కాశ్మీర్, అస్సాం మరియు నార్త్ ఈస్ట్ లలో మినహాయించి, 15 రోజుల నుండి 4 రోజులు వరకు ప్రత్యేక పోర్టింగుల సంకేతాల సమయాన్ని తగ్గించింది. పోర్ట్ అభ్యర్ధనలు ఇప్పుడు సులువుగా ఉపసంహరించుకోవచ్చు మరియు ఇది చేయడానికి కేవలం ఒక SMS చేయాలంతే.

ఇంకా, సరైన సమయంలో MNP అభ్యర్ధనలను పూర్తి చేయకుంటే,  అటువంటి టెలీకోస్ మీద జరిమానాలు విధించింది TRAI . పోర్ట్ అభ్యర్ధనల పైన ప్రతి తప్పుడు తిరస్కరణకు రూ. 10,000 వరకు జరిమానా విధించబడింది. కస్టమర్ ద్వారా MNP అభ్యర్ధన ప్రారంభించిన తరువాత 24 గంటల కాల వ్యవధిలో MNSP తో కస్టమర్ యొక్క వివరాలను తెలియచేయకపోతే, అటువంటి తేలికోలకు రూ .5,000 వరకు జరిమానా విధించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :