DoT ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసింది? గతవారంలో DoT ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా లేనికారణంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరియు జియో మధ్యవున్న స్పెక్ట్రమ్ ట్రడింగ్ డీల్ ను రద్దుచేసింది.
RCom – Jio మధ్యవున్న ఒప్పందాన్నిగతవారంలో DoT (డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) తిరస్కరించింది. ఇందుకు కారణం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుండి స్పెక్ట్రమ్ కొనుగోలుచేయడాన్ని మేనేజ్ చేయలేకపోవడమే. ఇదే గనుక నిజమైతే జియో కంపెనీ దివాళాతీసే అవకాశముంటుందని టెలికం రంగ నిపుణులు మరియు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఆంద్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లోని జియో వినియోగదారులకి సర్వీసులో అంతరాయం కూడా కలుగుతుంది.
ఎందుకంటే, ఈ జియో టెలికం ఉన్నతమైన 800 MHz బ్యాండ్ అందించడం కోసం పక్కపక్కగా ఉండేలా 5 యూనిట్ల బ్లాక్స్ ను నిర్మించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడ్డాయి. ఇలా ఎందుకు చేయాలి? ఎందుకంటే 4G LTE సర్వీస్ యొక్క ప్రధాన సర్కిళ్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ,కేరళ,కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో 800 MHz బ్యాండ్ కలిగిన 3.8 యూనిట్ల గాలి తరంగాలను జియో అందిస్తుంది. అయితే, ఈ మొత్తం ప్రక్రియ అంతాకూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైన ఆధారపడే, ఎటువంటి అంతరాయంలేకుండా LTE సేవలను అందిస్తోంది.
జియో కూడా తన సొంత స్పెక్ట్రమ్ ని కలిగి వుంది, కాని అది 1800 మరియు 2300 MHz బ్యాండుతో కలిగి ఉంటుంది. అయితే, ప్రతుతం మార్కెట్లో అవసరమైన 800 MHz బ్యాండ్ సేవలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో కలిసి అందిస్తోంది. ఒకవేళా, ఇప్పుడు తన సొంతం బ్యాండ్ ద్వారా సేవలను అందిచాలని జియో అనుకున్నట్లయితే, అది తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా LTE సేవలను అందించలేదు. అలాగే, మరల కొత్త టవర్లను నిర్మించడం మరియు వున్నా వాటిని 800 MHz బ్యాండుకు తీసుకురావడం వంటివి మరింత శ్రమ మరియు ఖర్చుతో కూడుకున్నవే అవుతాయి.