BSNL రూ. 399 ప్రీపెయిడ్ ప్లానులో మార్పు : ఇప్పుడు రోజువారీ 3.21GB డేటా
ముందుగా, ఈ ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1GB డేటా అందించేది.
భారత్ సంచార్ నిగమ లిమిటెడ్ (BSNL), ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలకు పోటీ ఇవ్వాలని ఆలోచిస్తూన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం అందుబాటులోవున్న రూ. 399 ప్రీపెయిడ్ ప్లానులో గొప్ప మార్పులు చేసింది. ముందుగా, ఈ ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS ప్రయోజనాలను అందిస్తున్నది. అయితే, ఇప్పుడు ఈ రూ. 399 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 3.21GB డేటాని, అతనా వినియోగదారులకి అందించనున్నది. కానీ , ఈ డేటా 2G/3G నెట్వర్కులకే పరిమితమవుతుంది మరియు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
BSNL రూ. 399 యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ BSNL రూ. 399 ప్రీపెయిడ్ ప్లానుతో, 74 రోజుల వ్యాలిడిటీ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ 26 ఆగష్టు 2018 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లానుతో, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS అమరియు డేటా ప్రయోజనాలను కూడా అందించింది. అంతేకాదు, ఈ ప్లానుతో వినియోగదారులు ఢిల్లీ మరియు ముంబై లోని వారికీ కూడా కాలింగ్ చేసుకునే అవకాశాన్ని అందించింది. వాస్తవానికి, BSNL యొక్క ఇతర ప్లానులు లేదా STV లకు ఈ అవకాశముండదు.
ప్రస్తుతం, BSNL యొక్క ఈ రూ. 399 యొక్క ప్రీపెయిడ్ ప్రణాళిక ద్వారా రోజువారి 3.21GB డేటాని అఫర్ చేస్తోంది మరియు ఈ ప్లాను యొక్క వ్యాలిడిటీ 74 రోజుల వరకూ ఉంటుంది. అయితే, ఈ అఫర్ 31 జనవరి, 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ SMS ప్రయోజనాలను అందుకుంటారు.