BSNL STV – 29 ప్రీపెయిడ్ ప్రణాళికలో మార్పులుచేసిన, BSNL

Updated on 14-Nov-2018
HIGHLIGHTS

BSNL యొక్క STV-29 రీచార్జితో డైలీ 1GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 7రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఈ ప్రభుత్వ టెలికామ్ కంపెనీ ప్రస్తుతం ఇతర ప్రైవేట్ టెలికామ్ సంస్థలకు గట్టిపోటీనిచ్చేలా కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రకటిస్తోంది. కానీ, ఇప్పుడు కొత్తగా STV-29 ప్రీపెయిడ్ ప్లాన్ నుండి కొంత మార్పులను చేసింది. ఈ 29 రూపాయల ప్రణాళికలో రోజువారీ డేటాని తగ్గించింది మరియు రోజువారీ 100 SMS స్థానంలో, 7 రోజులకు గాను 300SMS లను మాత్రమే అందిస్తోంది.

 

ముందుగా ఈ ప్లాన్ ద్వారా, 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ 100SMS ప్రయోజనాలను పూర్తి 7 రోజులకి వినియగదారులకి అందించింది.  అయితే, ప్రస్తుతం ఈ ప్రణాళికతో 1GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ మరియు పూర్తి 7 రోజుల చెల్లుబాటుకిగాను కేవలం 300SMS ప్రయోజనాలను వినియగదారులకి ఇస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీ మరియు ముంబాయి సర్కిళ్లలోని ఏ నెట్వర్కుకు అయినాసరే ప్రామాణిక రేట్లను వర్తింప చేసింది.

అయితే ఇప్పటికి ఈ ప్లానులో చెప్పుకోతగిన విషయమేమిటంటే,  ఇప్పటికి వినియోగదారులు అపరిమితంగా మార్చుకునే వీలున్న హలొ ట్యూన్ సబ్ స్క్రిప్షన్.

కానీ, రిలయన్స్ జియో యొక్క 52 రూపాయల ప్రణాళిక అందించే రోజువారీ 150MB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 70 SMS లతో 7 రోజుల చెల్లుబాటుతో పోలిస్తే, ఇది ఇప్పటికీ పైచేయిగానే ఉంటుంది.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :