తెలంగాణా రాష్ట్రంలోని ఈ 25 పట్టణాలలో BSNL 4G సర్వీస్ షురూ..
BSNL, ఇప్పుడు దేశమంతటా తన 4G సేవలను అందించడానికి సిద్ధమవుతోంది.
ఇటీవలే కంపెనీకి 2100MHz స్పెక్ట్రం కూడా అందించబడింది
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 25 పట్టణాలకు ఈ సర్వీసును ఇప్పుడు విడుదల చేసింది.
దేశంలోని పలు సర్కిళ్లలో తన 4G VoLTE అందిస్తోంది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL, ఇప్పుడు దేశమంతటా తన 4G సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి, దేశంలోని పలు సర్కిళ్లలో తన 4G VoLTE అందిస్తోంది. ముందునుండే, ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాలలో తన 4G సేవలను అందిస్తుండగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 25 పట్టణాలకు ఈ సర్వీసును ఇప్పుడు విడుదల చేసింది. అయితే, రాష్ట్ర రాజధాని మరియు అతిపెద్ద సిటీ అయినటువంటి హైదరాబాద్ నగరానికి మాత్రం ఈ సర్వీసును అందించకపోవడం, పెద్ద లోటుగా చెప్పొచ్చు. ముందుగా ఈ విషయం టెలికం టాక్ ద్వారా తెలియవచ్చింది.
టెలికం టాక్ ప్రకారం, కొత్తగా తెలంగాణ రాష్ట్రంలోఈ సర్వీసును అందుకున్న ఈ 25 పట్టణాల విషయానికి వస్తే, భద్రాచలం, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, అసిఫాబాద్, వైరా, మంగపేట్, రాజుపేట, ఎటుర్నగరం,బాన్సువాడ, నాగర్ కర్నూల్, షాద్ నగర్, గద్వాల్, జడ్చర్ల, వనపర్తి, కంది, సంగారెడ్డి, మిర్యాలగూడ, తాడావి, భవనగిరి మరియు నాగార్జున సాగర్ వంటి పట్టణాలకు ఇప్పుడు BSNL యొక్క 4G కళ సంతరించుకుంది.
ఇటీవలే కంపెనీకి 2100MHz స్పెక్ట్రం కూడా అందించబడింది కాబట్టి ఇప్పుడు 4G యొక్క నిరంతర సేవలను అందించడానికి పూర్తిగా సిద్ధమవుతోంది. ఇప్పుడు గుజరాత్ మరియు మరికొన్ని సర్కిళ్లలో తమ 4G VoLTE సర్వీసును మొదలుపెట్టినట్లు, BSNL తెలియచేసింది. అయితే, ప్రస్తుతానికి 4G నెట్వర్క్ రిలే కోసం 3G యొక్క వాయు తరంగాలనే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో BSNL ప్రకటనలను ఒకసారి తిరిగి పరిశీలిస్తే, చెన్నై లో BSNL యొక్క 4G SIM అప్డేట్ చేసుకునవారికి 2GB ఉచిత డేటా ని కూడా అందించిన విషయం మనకు తెలుసు.
అయితే, ప్రస్తుతం తన 3G నెట్వర్క్ లో అన్నింటి టెలికం కంపెనీల కంటే కూడా ఉత్తమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అఫర్ చేస్తోంది. అలాగే, తెలుగు రాష్ట్రాలతో సహా కొన్నిసర్కిళ్లలో కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికల పైన ఆత్యదికంగా, రోజుకు 2GB డేటాని ఉచితంగా అందిస్తోంది. ఇంకా కొత్త రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 6 నెలల అన్లిమిటెడ్ కాలింగ్ వాటి ఉత్తమైన ప్లాన్లను కూడా పరిచయం చేసింది. ఇక 4G సర్వీస్ ప్రారంభమైనది కాబట్టి ఎటువంటి ఉత్తమ ప్లాన్స్ తీసుకువస్తుందో చూడడానికి మరి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది.