ఎయిర్టెల్ మరియు వొడాఫోన్-ఐడియా యొక్క 20కోట్ల మంది వినియోగదారుకు గడ్డుకాలం: నివేదిక
వోడాఫోన్-ఐడియా మరియు ఎయిర్టెల్ సిమ్ చందాదారుల యొక్క కనెక్షన్లను త్వరలో నిలిపివేయవచ్చు, వారు నెలకు 35 రూపాయల కన్నాతక్కువ రీఛార్జి ఖర్చు చేసేవారైతే మాత్రమే.
వొడాఫోన్-ఐడియా మరియు భారతి ఎయిర్టెల్ రెండు కూడా, తక్కువ 'యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్' (ARPU) కలిగిన చందాదారుల కనెక్షన్లను నిలిపివేయాలని నిర్ణయించాయి. అంటే, అలాంటి వినియోగదారులకు ARPU సుమారు 10 రూపాయల మేరకు వసూలు చేస్తున్నందువల్ల, ఎయిర్టెల్ యొక్క నెలవారీ ఆదాయంలో రూ. 100 కోట్లు ఉత్పత్తి అవుతుందని తెలిసింది. ఒకవేళ దీనిని 35 రూపాయలకు పెంచినట్లయితే, మొత్తం నెలసరి ఆదాయం 175 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదికలు చెబుతున్నాయి. అంటే దీని అర్థం, వినియోగదారులు ఈ అధిక ధర ప్రణాళికలు తీసుకోకపోయినట్లయితే, 25కోట్ల 2G కనెక్షన్లు వెంటనే నిలిపివేయబడవచ్చు. దీని ద్వారా ఎయిర్టెల్ ఏమి చెబుతుందంటే, సుమారు 10కోట్ల మంది వినియోగదారులకు నెలకు 35 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారు, 15కోట్ల మంది వొడాఫోన్ ఐడియా చందాదారులు ఒకే రకమైన కేటగిరీలో పడిపోతున్నారు. ఈ టెలీకోలు, ఈ APRU కంటే దిగువనవున్న అన్ని ప్రణాళికలను పూర్తిగా రద్దు చేశారు మరియు ఈ రెండు, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కూడా వరుసగా నెలకు రూ 35 వద్ద ప్రారంభమయ్యే 5 మరియు 7 ప్రణాళికలు విడుదలచేసాయి.
"మేము 33 కోట్ల మంది వైర్లెస్ కస్టమర్లను కలిగి ఉన్నాము, వీరిలో మేము కొందరిని టెలినార్ నుండి మరియు కొంతమందిని సొంతంగా కలిగివున్నాము. అయితే వీరిలో, చాలా తక్కువ స్థాయిలో ARPU ను కలిగివున్నవినియోగదారులు దాదాపుగా 10కోట్ల మంది వరకూ ఉంటారు, అందువల్ల ఈ APRU తక్కువ స్తాయిలో ఉంటోంది 'అని భారతీ ఎయిర్టెల్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ చెప్పారు.
వోడాఫోన్ ఐడియా CEO బాలేశ్ శర్మ, మాట్లాడుతూ "ఇది కేవలం ఇన్ కమింగ్ కోసం మాత్రమే ఉపయోగించే వారు మాత్రమే ఆలోచించాల్సిన విషయం తప్ప, సాధారణ మరియు అపరిమిత ప్రణాళిక వినియోగదారుల బయపడాల్సిన అవసరంలేదు. ఈ అన్లిమిటెడ్ కానివారు కేవలం అపరిమితమైన ప్రణాళికను తీసుకునే వినియోగదారుల మొత్తంలో నాల్గవ వంతు మాత్రమే. అందువలన, అపరిమిత ప్లాన్ కంటే కింద స్థాయివారు, ఇప్పుడు కనీసం రూ. 35 తో ఒక నెల ప్యాకేజికి రుసుము చెల్లించాల్సివుంటుంది. లేకుంటే, అపరిమిత ప్యాకేజీ తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు ARPU సమస్య ఉండదు". కానీ, వోడాఫోన్ యొక్క తక్కువ ARPU కేటగిరికి చెందిన వినియోగదారుల మొత్తం సంఖ్య ఇక్కడ పంచుకోలేదు.
ఒక రెండవ మొబైల్ కనెక్షనుగా ఎయిర్టెల్ లేదా వొడాఫోన్ ఐడియా సిమ్ ఉపయోగిస్తే, సగటున నెలకు 35 రూపాయల కన్నా తక్కువగా రీఛార్జి చేసుకునే అవకాశముండేది ఇప్పటివరకు. ఈ రెండవ కనెక్షన్లను సాధారణంగా కేవలం కాల్స్ స్వీకరించడం(ఇన్ కమింగ్) కోసం మాత్రమే ఉపయోగిస్తారు మరియు రూ 10 యొక్క బేస్ రీఛార్జ్ యొక్క ప్రామాణికతతో కనెక్షన్ కొనసాగుతుందని నిర్ధారిస్తుంది. కానీ ఇప్పుడు, ఈ Telcos ద్వారా తీసుకోబడిన ఈ చర్యలవలన వారి చందాదారులు అధిక ధర ప్రణాళిక అయినటువంటి నెలకు రూ 35 లకు మారడంగాని, లేదా వారి ప్రాధమిక సిమ్ ఆపరేటర్లుకు మారడం వంటివి జరుగుతాయని అర్ధమవుతోంది.