Nokia 6G lab: ఇండియాలో 6G ల్యాబ్ తెరిచిన నోకియా | New Tech
నోకియా ఇండియాలో తన Nokia 6G lab ను తెరిచింది
నోకియా తీసుకు వచ్చిన కొత్త తరహా ప్రాజెక్ట్, ఈ నోకియా 6జి ల్యాబ్
నోకియా 6జి ల్యాబ్ ను నోకియా వర్చువల్ గా ప్రవేశపెట్టింది
నోకియా ఇండియాలో తన Nokia 6G lab ను తెరిచింది. వాస్తవానికి, ఇండియాలో 5G నెట్ వర్క్ పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఇంకా అందుబాటలోకి రాలేదు. కానీ, నోకియా మాత్రం అప్ కమింగ్ టెక్ పైన పూర్తి పరిజ్ఞానం కోసం ఇప్పటి నుండే తన సహాయ సహకారాలను అందిచడనికి ప్రయత్నం చేస్తోంది. ఈ కొత్త నోకియా 6జి ల్యాబ్ ను యూనియన్ టెలికం మినిష్టర్, అశ్వని వైష్ణవ్ వర్చువల్ గా ఇనాగ్యురేట్ చేశారు. నోకియా తీసుకు వచ్చిన ఈ నోకియా 6జి ల్యాబ్ ముచ్చట్లు ఏమిటో జత చూద్దాం పదండి.
అసలు ఏమిటి Nokia 6G lab?
6G టెక్నాలజీ ప్రాధమిక సాంకేతికత (Fundamental Technology) మరియు ఆవిస్కరణ (innovation) డెవలప్మెంట్ కోసం నోకియా తీసుకు వచ్చిన కొత్త తరహా ప్రాజెక్ట్, ఈ నోకియా 6జి ల్యాబ్.
ఈ నోకియా 6జి ల్యాబ్ అనేది 6G టెక్నాలజీ లో భారత ప్రాధాన్యతను మరియు ప్రాతినిధ్యాన్ని ప్రపంచానికి చెప్పే ఉద్దేశ్యంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పరిచయం చేసిన ‘Bharat 6G Vision’ కి సపోర్ట్ చేస్తుంది.
Also Read : Amazon సేల్ భారీ డిస్కౌంట్ తో రూ.1,000 లోపలే లభిస్తున్న Smart Watch Deals.!
ప్రసుతం ఈ నోకియా 6G ల్యాబ్ ఎక్కడ వుంది?
నోకియా 6జి ల్యాబ్ ను నోకియా వర్చువల్ గా ప్రవేశపెట్టింది. అయితే, గ్లోబల్ 6జి టెక్నాలజీ స్టాండర్డ్స్ లో భాగంగా విక్రేతల కోసం నోకియా యొక్క బెంగుళూరు సెంటర్ నుండి నిపుణులు పని చేస్తారని నోకియా తెలిపింది.
స్థిరమైన సిస్టం డిజైన్, ప్రైవసీ మరియు అల్గారిథమ్స్ ను పరిశోధించడానికి నోకియా 6G ల్యాబ్ ఇండియాలో ప్రయోగాత్మక వేదికగా నిలుస్తుందని నోకియా తెలిపింది.
వాస్తవానికి, నోకియా ఇప్పటికే 6G Development కోసం చాలా గ్లోబల్ ప్రోజెక్ట్స్ లో పాలుపంచుకుంటోంది. అయితే, ప్రపంచం వ్యాప్తంగా 6G కోసం చేస్తున్న కృషిలో భారత్ ప్రధాన భాగంగా మారేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ‘భారత్ 6జి విజన్’ తో కలిసి నడవడం చాలా సంతోషకరమైన విష్యం, అని కూడా నోకియా తెలిపింది.