భారతీయ మార్కెట్లోకి కొత్త టెలికం వస్తున్నట్లు ప్రస్తుత నివేదికలు కోడై కూస్తున్నాయి. అదే, ప్రముఖ వ్యాపారవేత్త, గౌతమ్ అదానీ యొక్క అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ADNL). ఇటీవల జరిగిన 5G స్పెక్ట్రమ్ నుండి లైసెన్స్ దక్కించుకున్న అదానీ గ్రూప్ నుండి ఈ కొత్త టెలికం వస్తోంది. 26GHz మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో 400 MHz స్పెక్ట్రమ్‌ను ఉపయోగించడానికి 20 సంవత్సరాల లైసెన్స్ కోసం అదానీ కంపెనీ రూ. 212 కోట్లు చెల్లించింది. తద్వారా భారతదేశంలో పూర్తి టెలికాం సేవలను అందించడానికి లైసెన్స్ అదానీ డేటా నెట్‌వర్క్ లిమిటెడ్ అందుకున్నట్లు, నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే, దిగ్గజ టెలికం కంపెనీలైన Jio, Airtel మరియు Vodafone Idea (Vi) టెలికం కంపెనీలకు పోటీగా Adani Data Network Limited (ADNL) మార్కెట్ లో పోటీపడానికి వస్తునట్టు కనిపిస్తోంది.
అదానీ కొత్త తేలిక కంపెనీ ADNL తన ప్రణాళికలను ఎలా రూపొందిస్తుందనే విషయం పైన ఇటీవల అదానీ గ్రూప్ చేసిన ప్రకటన కొంత అవగాహన కలిగించింది. ఈ ప్రకటన ప్రకారం. "కొత్తగా కొనుగోలు చేసిన 5G స్పెక్ట్రమ్ అదానీ గ్రూప్ యొక్క కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ఇండస్ట్రీ మరియు B2C బిజినెస్ పోర్ట్‌ఫోలియో డిజిటలైజేషన్ యొక్క వేగం మరియు స్థాయిని వేగవంతం చేసే సమీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ లను రూపొందించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు."
అంటే, కంపెనీ ఎక్కువగా ఎంటర్‌ప్రైజ్ ఆఫర్స్ పైన దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది. వాస్తవానికి, అదానీ కంపెనీ చాలా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు మరియు మరిన్ని ఇతర రంగాలను ఇప్పటికే కలిగివుంది. కాబట్టి, ఇటీవల స్పెక్ట్రమ్ నుండి చేజిక్కుంచుకున్న 5G ఎయిర్ వేవ్ లను వారి కంపెనీల యొక్క కనెక్టివిటీ సేవలను మెరుగుపరచడంపై దృష్టి సరిస్తాయి మరియు ఈ సేవలను మరిన్ని ఇతర సంస్థలకు విస్తరించడం వంటివి చేస్తుంది.
వాస్తవాలను పరిశీలించి చుస్తే, 5G సర్వీస్ ను వినియోగదారులకు అందించే వ్యాపారంలో అదానీ గ్రూప్, Jio మరియు Airtel నుండి ప్రస్తుతం దూరంగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే, ఇప్పటికే ఉన్న అన్ని టెలికాం కంపెనీలు కూడా కస్టమర్లకు ప్రియమైన బ్రాండ్ లుగా ఇప్పటికే స్థిరపడ్డాయి. రెండవది, దేశంలో 5G ఇంకా భారీ వృద్ధిని చూడబోదు. ఇటువంటి చాలానే కారణాలను నిప్పులు ఊహించి చెబుతున్నారు.