అక్టోబర్ 1 నుండి అమలులోకి New SIM Card Rules .. ఫాలో అవ్వక పొతే 10 లక్షల Fine.!
టెలికం కంపెనీలకు కేంద్రం New SIM Card Rules ను నిర్ధేశించింది
అక్టోబర్ 1 నుండి ఈ New Rules అమలులోకి
ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వకపోతే 10 లక్షల చొప్పున Fine
టెలికం కంపెనీలకు కేంద్రం New SIM Card Rules ను నిర్ధేశించింది. ఈ అక్టోబర్ 1 నుండి ఈ New Rules అమలులోకి వస్తాయని ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వకపోతే 10 లక్షల చొప్పున Fine ను విధించనున్నట్లు కూడా ఘాటుగా చెబుతోంది. ఇప్పటికే ఈ రూల్స్ గురించి అన్ని టెలికం కంపెనీలకు ఆదేశాలు అందినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ AI Tool సిమ్ కార్డ్ హోల్డర్ వెరిఫికేషన్ లో విస్తుపోయే నిజాలు బయట పడిన తరువాత ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక విషయంలోకి వెళితే, SIM Card హోల్డర్స్ యొక్క ID Verification కోసం DoT ఇటీవల చేసిన AI Tool వెరిఫికేషన్ లో లక్షల కొద్దీ బోగస్ మరియు సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా తీసుకున్న SIM Cards బయపడ్డాయి. ఇందులో ప్రధాన భాగం సిమ్ కార్డ్ లను నేరుగా విక్రయించే దుకాణదారుల హస్తం ఉందని గమనించిన కేంద్రం, అర్హత లేని మరియు KYC తనిఖీ చేయని దుకాణదారుల పని పట్టేందుకు ఈ New SIM Card Rules ను తీసుకొచ్చింది.
ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ప్రకారం, టెలికం కంపెనీలు అన్ని కూడా వారి అనుబంధ దుకాణదారుల KYC ని తనిఖీ చేసి అర్హత ల్ని వారిని నిలువరించాలి. అలాకాకుండా టెలికం కంపెనీ సరైన వెరిఫికేషన్ చేయని యెడల ఒక్కో దుకాణానికి 10 లక్షల చొప్పున ఫైన్ ను చెల్లించాల్సి ఉంటుందని ఘాటుగా చెప్పింది.
అంటే, Reliance Jio, Airtel మరియు Vodafone Idea (Vi) టెలికం కంపెనీలు వాటి SIM Card లను విక్రయించే దుకాణధారులు వివరాలను పూర్తిగా వెరిఫై చేసి అటు తరువాతే వారికి కొత్త సిమ్ కార్డ్ లను విక్రయించే అధికారాన్ని ఇవ్వాలి. ఈ కొత్త రూల్స్ ను పాటించని టెలికం కంపెనీ ఒక్కొక దుకానానికి 10 లక్షల Fine చెల్లించ వలసి ఉంటుంది.
ఈ కొత్త చర్య ద్వారా SIM Card విక్రయాల్లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. గతంలో, ఆంద్రప్రదేశ్ రాష్టంలోని విజయవాడకు చెందిన ఒక ప్రధాన డీలర్ యొక్క ఒకే ఫోటో తో 600 కు పైగా SIM Card లను తీసుకొన్నటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూండా చూడవచ్చు.
ఇది ఒక చిన్న ఉదహరణ మాత్రమే ఇటువంటి ఘటనలు తమిళనాడు, గుజరాత్ తో సహా చాలా రాష్టాల్లో చోటు చేసుకున్నాయి.