వెంటనే Mobile Recharge చేయండి.. లేదంటే రేపటి నుంచి వీపు విమానం మోత మోగిపోద్ది.!
టెలికాం కంపెనీలు కస్టమర్ల నడ్డి విరచడానికి కంకణం కట్టుకున్నాయి
టెలికాం కంపెనీలు ప్రకటించిన ప్రైస్ హైక్ అల్టిమేటం మరింత దడ పుట్టిస్తోంది
రెండు రోజుల్లో ఎన్నడూ చూడని రేట్ లతో మొబైల్ రీఛార్జ్ చేసే దిశగా యూజర్లు సాగుతారు
టెలికాం కంపెనీలు కస్టమర్ల నడ్డి విరచడానికి కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు టెలికాం కంపెనీలు ప్రకటించిన ప్రైస్ హైక్ అల్టిమేటం మరింత దడ పుట్టిస్తోంది. జూలై 3 నుంచి Mobile Recharge ధరలు పెరుగుతాయని జియో ప్రకటించిన వెంటనే అదే దారిలో ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కూడా కొత్త ప్రకటన చేశాయి. మొత్తానికి రానున్న రెండు రోజుల్లో ఎన్నడూ చూడని రేట్ లతో మొబైల్ రీఛార్జ్ చేసే దిశగా యూజర్లు సాగుతారు.
Mobile Recharge
టెలికాం కంపెనీలు నష్టాల బాటలో నడవకుండా, 5జి నెట్ వర్క్ పైన వెచ్చించిన ఇన్వెస్ట్ మెంట్ మరియు ఇతర వనరులు స్థిరంగా నిలపడానికి టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన SIM కన్సాలిడేషన్ ప్రకటన తర్వాత ఈ టారిఫ్ హైక్ ప్రకటన వెలువడింది. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం కూడా తీసుకున్నారు. కొత్త నిర్ణయం ప్రకారం, రీఛార్జ్ రేట్లు 11 నుంచి 25% వరకూ పెరుగుతాయి. దీనికి సంబంధించిన కొత్త రీఛార్జ్ లిస్ట్ ను కూడా కంపెనీలు అందించాయి.
Jio రీఛార్జ్ రేట్లు ఎంత పెరుగుతాయి?
జూలై 3 నుంచి రిలయన్స్ యూజర్లు రీఛార్జ్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. మినిమం రీఛార్జ్ ప్లాన్ అయిన రూ. 155 తో రీఛార్జ్ చేయడానికి జూలై 3 నుంచి రూ. 189 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 2,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ కోసమైతే ఏకంగా రూ. 3,599 రూపాయలు చెల్లించాలి. అంటే, ఈ ప్లాన్ రేటు ఏకంగా రూ. 600 రూపాయలు పెరుగుతుంది. జూలై 3 నుంచి అమల్లోకి రాబోతున్న జియో రీఛార్జ్ కొత్త రేట్లు ఈ క్రింద చూడవచ్చు.
Also Read: Flipkart బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై అదిరే ఆఫర్.!
Airtel రీఛార్జ్ రేట్లు ఎంత పెరుగుతాయి?
ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్లు కూడా జూలై 3 తేదీ నుంచి పెరుగుతాయని తెలిపింది. ఎయిర్టెల్ ప్లాన్ రీఛార్జ్ రేట్లు 11 నుండి 21% వరకు పెరుగుతాయని కన్ఫర్మ్ అయ్యింది. అంటే, ఎల్లుండి నుండి ఎయిర్టెల్ యూజర్ చేసే రీఛార్జ్ పైన మరింత భారం పెరుగుతుంది.
Vi రీఛార్జ్ రేట్లు ఎంత పెరుగుతాయి?
జూలై 4 నుంచి రీఛార్జ్ రేట్లలో మార్పులు ఉంటాయని వోడాఫోన్ ఐడియా తెలిపింది. వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లు కూడా దాదాపు 10% నుంచి 21% వరకూ పెరిగే అవకాశం వుంది.