జియో గిగా ఫైబర్ సేవలను కమర్షియల్ గా అందరి కోసం ప్రకటించేందుకు, జియో తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, ఆగష్టు 12 వ తేదీన ఈ సేవలను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే, రానున్న ఆగష్టు 12 వ తేదీన 42 వ తమ వార్షిక సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని జరపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే, కాబట్టి ఇదే రోజున ఇప్పటి వరకూ కొంతమందికి మాత్రమే ఉచితంగా లభిస్తున్న ఈ సేవల యొక్క ప్లాన్స్ మరియు ధరలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
అలాగే, మరిన్ని నివేదికల ప్రకారం, ఈ బ్రాండ్ సేవలతో పాటుగా, స్మార్ట్ హోమ్ సొల్యూషన్ మరియు హోమ్ ఎంటర్నైన్మెంట్ వంటి వాటిని కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, ముందు నుండి ప్రచారంలో వున్నా కొన్ని రూమర్లు నిజమవ్వవచ్చని మనం ఊహించవచ్చు. ఒకవేళ, ఇదే గనుక నిజమైతే జియో ట్రిపుల్ ప్లే ప్లాన్ గురించి ముందుగా అంచనావేసినట్లుగా జరగనున్నట్లు అనిపిస్తోంది. అలాగే, ఈ కనెక్షన్ కోసం ముందుగా 2500 రూపాయల వన్ టైం డిపాజిట్ చెల్లిచేవిధంగా ఉండనున్నట్లు కూడా తెలుస్తోంది.
ప్రసుతం చేస్తున్న టెస్టింగ్ ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా 100Mbps వేగంతో 100GB డేటాని అందించినట్లు కూడా కొన్ని నివేదికలు వివరిస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజమైతే గనుక, తొందరలోనే ప్రతిఒక్కరికి అతితక్కవ ధరకే ఈ మూడు సేవలు అందుతాయి. జియో అత్యంత వేగవంతమైన ఆప్టికల్ ఫైబర్ సాంకేతికతతో ఈ FTTH సేవలనను చాల తక్కువ ధరకే అందుకోవచ్చు.