ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా డేటా ధరలు 10 రేట్లు పెరగొచ్చు

ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా డేటా ధరలు 10 రేట్లు పెరగొచ్చు
HIGHLIGHTS

ఈ చర్య మార్కెట్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఈ కమిషన్ అభిప్రాయపడింది.

ప్రస్తుతం, ఎయిర్టెల్, వొడాఫోన్, జియో వంటి పెద్ద టెలికాం సంస్థలు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేశాయి. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే తర్వాత మీ టెలికం బిల్లులు చాలా రెట్లు పెరుగుతాయి. వినియోగదారుల మొబైల్ డేటా మరియు కాలింగ్ ధరలు ఏకంగా 10 రెట్ల వరకూ పెరుగుతాయి.

భారతీయ వినియోగదారులు 4 జి డేటా కోసం 1GB కోసం 3.5 రూపాయలు చెల్లించాలని మరియు ఇది కంపెనీలు ఇచ్చే కనీస రేటుగా నిర్ణయించబడింది, ఇది గనుక మారితే  మీ ప్రస్తుత ప్లాన్ల ధరలు 5 నుండి 10 రెట్లు పెరుగుతాయి.

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది మరియు ఈ కంపెనీ కనీసం జిబికి రూ .35 చొప్పున డేటా ధరను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని  కోరింది, భారతి ఎయిర్టెల్ కూడా ఒక GB డేటాకు రూ .30 రూపాయల ధరను ప్రతిపాదించింది. ఇది కాకుండా రిలయన్స్ జియో GB తనదైన పంధాలో రూ .20 ధరను నిర్ణయించాలనుకుంటుంది. టెలికాం ప్రొవైడర్ల నుండి రెగ్యులేటర్లు గనుక ఈ ఆఫర్‌ ను అంగీకరిస్తే, డేటా ధరలు 10 రెట్లు పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహంలేదు.

ఇది వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుంది?

ఉదాహరణకు, మీరు GB కి 3.5 రూపాయల చొప్పున డేటాను ఉపయోగిస్తూ మరియు రూ .599 తో ప్లాన్‌ ను యాక్టివేట్ చేస్తే, దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉందనుకోండి. ఈ ప్లానులో, మీరు రోజుకు 2GB డేటాను 4G వేగంతో పొందుతారు. అయితే, ఇప్పుడు కంపెనీల యొక్క ఈ ప్రతిపాదనను ప్రభుత్వం కనుక అంగీకరించి, బేస్ ధరను నిర్ణయించినట్లయితే, ఇదే ప్లాన్ వినియోగదారులకు రూ .3,360 నుండి 5,880 మధ్య ఉంటుంది.

ట్రాయ్ పరిశ్రమ నుండి వచ్చిన డిమాండ్ దృష్ట్యా, కాల్స్ మరియు డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పార్టీలతో చర్చలు జరుపుతోంది.

అయితే, అనుకూల విషయం ఏమిటంటే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ చర్య మార్కెట్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఈ కమిషన్ అభిప్రాయపడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo