త్వరలో రానున్న మాన్యువల్ సిమ్ కార్డు వెరిఫికేషన్ వినియోగదారులకి మరియు టెలికామ్ కంపెనీలకు ఇబ్బందికరం కావచ్చు

త్వరలో రానున్న మాన్యువల్ సిమ్ కార్డు వెరిఫికేషన్ వినియోగదారులకి మరియు టెలికామ్ కంపెనీలకు ఇబ్బందికరం కావచ్చు
HIGHLIGHTS

ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంటే ముందు, ఫ్రాడ్ ప్రూఫ్ లతో మొబైల్ నంబర్లను తీసుకున్న విషయాన్ని కూడా విన్నవించిన టెలికామ్ సంస్థలు.

టెలికామ్ సంస్థలు వినియోగిస్తున్న, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని నిలిపివేయాలని, సుప్రీమ్ కోర్టు ఉత్తర్వుల తరువాత టెలికామ్ సంస్థలు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT) త్వరలో తలెత్తనున్న కొత్త సమస్య గురించి ఆలోచిస్తున్నాయి. ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్, చాల సులభమైనది మరియు సురక్షితమైనది కావడం వలన వీటితో ప్రాధమిక సెక్యూరిటీ వంటి సమస్యలు తలెత్తలేదు.   కానీ, ఆధార్ బయోమెట్రిక్ కాకుండా భౌతిక వెరిఫికేషన్ తో మొబైల్ నంబర్లను పంపిణి చేయవల్సివస్తే, సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని సూచిస్తున్నాయి.

టెలికామ్ సంస్థలు, ఇప్పటికే వినియోగదారు డిజిటల్ వెరిఫికేషన్ మరియు సెక్యూరిటీ ఏజెంట్ వెరిఫికెషన్ కోసం ప్రత్యామ్నాయల కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నప్పటికీ, ఇవి ఆధార్ బాయోమెట్రిక్ విధానమంత ఖచ్చితంగా ఉండక పోవచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఎందుకంటే, వినియోగదారులు సమర్పించే పేపర్లు సారైనవికావని నిరూపించడానికి ఏవిధమైన ఆధారం ఉండదు కాబట్టి, వాటిని ఆధారం చేసుకొని  మొబైల్ నంబర్లను పంపిణీ చేయవలసి  వుంటుంది.  తద్వారా, ఆధార్ కంటే ముందుగా కొన్ని మొబైల్ నంబర్ల పంపిణీలో జరిగినటువంటి మోసాలు జరిగే అవకాశముండవచ్చని ఆలోచిస్తున్నాయి.

అయితే, ఆధార్ పైన తలెత్తిన సెక్యూరిటీ కారణంగా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి, టెలికామ్ సంస్థలు నవంబర్ 5 వరకు తమయొక్క ప్రత్యామ్నాయ డిజిటల్ వెరిఫికేషన్ ప్రూఫ్ విధానాలని అంటే మొబైల్ నంబర్ పంపిణి కోసం ఆమోద పద్దతిని అందచేయవలసి ఉంటుంది. " టెలికామ్ సంస్థలు వ్యక్తిగతంగా DOT ని సంప్రదించి వారి యొక్క డిజిటల్ వెరిఫికేషన్ ప్రూఫ్ విధానాలని మరియు వాటివలన కలిగే ప్రయోజనాలని తెలియచేసి దానిపైన DOT నుండి  ఆమోదం తీసుకోవలసి  ఉంటుంది.  ఇది వ్యక్తిగతం ప్రాధిపదికన మరియు వారి సిద్ధంచేసిన ఆమోదయోగ్యమైన విధానాన్ని బట్టి వ్యక్తిగత ఆపరేటర్లకు ఆమోదించబడనుందని" COAI డైరెక్టర్ జనరల్ అయినటువంటి, రాజన్ మాథ్యూస్ తెలిపారు.                                                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo