BSNL 5G: యూజర్లకు అప్పటి వరకూ 5G సర్వీస్ వస్తుందని తెలిపిన కేంద్రం.!

Updated on 28-Jan-2023
HIGHLIGHTS

BSNL కూడా 5G సేవలు వైపుగా అడుగులు వేస్తోంది

4G పూర్తిగా వాడుకలోకి తీసుకువచ్చే యోచనలో BSNL

4G నెట్ వర్క్ కోసం ఎదురు చూస్తున్న BSNL వినియోగదారులకు కొత్త న్యూస్

BSNL 5G: యూజర్లకు అప్పటి వరకూ 5G సర్వీస్ వస్తుందని తెలిపిన కేంద్రం ప్రభుత్వం. రిలయన్స్ Jio మరియు Airtel ఇప్పటికే తమ 5G సర్వీస్ లను విస్తరిస్తూ ఉండగా, ప్రభుత్వ టెలికం సంస్థ BSNL కూడా 5G సేవలు వైపుగా అడుగులు వేస్తోంది. అయితే, వాస్తవానికి,   BSNL ఇప్పటికీ 3G నే అంటిపెట్టుకుని కొనసాగుతోంది. లేటెస్ట్ గా BSNL 5G గురించి బయటకి వచ్చిన కొత్త విషయాలేమిటో  తెలుసుకుందాం.

2024 నాటికి BSNL తన 5G సేవలను ప్రారంభించనుందని, కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తెలియపరిచారు. దీని గురుంచి మాట్లాడుతూ, 5G సేవల కోసం BSNL వినియోగదారులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఎప్పటి వరకూ BSNL 5G సర్వీసులు వస్తాయని కూడా వెల్లడించారు. ముందుగా, దేశవ్యాప్తంగా BSNL 4G విస్తరించి తరువాత వాటిని 5G కి అప్డేట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే, BSNL 4G సర్వీస్ విస్తరణ గురించి కొత్తగా వస్తున్న నివేదికలను విశ్వసితే, 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ సంవత్సరంలో BSNL 4G పూర్తిగా వాడుకలోకి తీసుకువచ్చే యోచనలో వుంది. అంటే, 4G నెట్ వర్క్ కోసం ఎదురు చూస్తున్న BSNL వినియోగదారులకు ఈ కొత్త న్యూస్ నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :