టాటా స్కై నుండి చానళ్లను విడివిడిగా ఎంచుకోవడం ఎలాగో తెలుసుకోండి!

టాటా స్కై నుండి చానళ్లను విడివిడిగా ఎంచుకోవడం ఎలాగో తెలుసుకోండి!
HIGHLIGHTS

టాటా స్కై, టీవీ ఛానల్ ధరలను ఎలా చూపిస్తోందో తెలుసుకోండి.

ఇప్పుడు, ఈ TRAI యొక్క కొత్త నిబంధనలకు అనుగుణంగా దాదాపుగా అన్ని ప్రధాన DTH సర్వీస్ ప్రొవైడర్లు, వారి యొక్క కొత్త విధానాలను తీసుకొచ్చారు. కాబట్టి, DTH ప్రొవైడర్లు వారి వారి ప్యాకేజీలను అందిస్తున్నారు. అలాగే, టాటా స్కై DTH సర్వీస్ ప్రొవైడర్ చానళ్లను విడివిడిగా ఎంచుకోవడానికి ఎలాంటి ఎంపికలను అందిస్తుందో చూద్దాం. 

Tata Sky

చందాదారులు వారికీ అంచనా చానళ్లను విడివిడిగా ఎంచుకోవడం కోసం, టాటా స్కై ఒక Web-Portal సెటప్పును అందిస్తోంది. వారికీ కావాల్సిన చానళ్లను ఎంచుకోవ దానికి మొగ్గు చూపే చందాదారులు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ (RTN) లేదా Subscriber ID తో లాగిన్ చేయాలి. ఈ వెబ్సైటులోకి లాగిన్ చేసే ప్రవేశించిన తరువాత, వారికీ 'Recommended For You', 'Tata Sky Packs'  మరియు 'All Packs and Channels' అనే  మూడు ఎంపికలు కనిపిస్తాయి.

మూడు ఎంపికలలో, మొదటిది చందాదారుల యొక్క ప్రస్తుతం వాడుతున్న ప్యాకేజీ ఆధారితంగా ఉంటుంది. ఇక రెండవదాని విషయానికి వస్తే, టాటా స్కై అందించే "క్యూరేటెడ్ & రీజనల్ ప్యాక్స్" . మూడవ ఎంపిక, నెట్వర్క్ బ్రాడ్కాస్టర్లు అందించే అన్నిచానళ్లను ఒక లిస్టుగా చూపిస్తుంది.

అయితే, దీన్ని పరిశీలించడానికి మేము లాగిన్ చేసి, 'Recommended For You' ను ఎంచుకున్నాము. ఇందులో, ప్రస్తుతం మనము వాడుతున్న ప్యాకేజితో పోలిస్తే,  ధరలు ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం, మేము 221 ఛానళ్లు మరియు సర్వీసులు కలిగి రూ. 420ధరతో వుండే,  స్పోర్ట్ ధమాకా ప్యాక్ వాడుతున్నాము. కానీ, ఈ క్రొత్త ఎంపిక ఇటువంటి ఛానళ్లతో నెలకు రూ.646 ధరతో చూపిస్తోంది. రెండవ ఎంపిక అయిన 'Tata Sky Packs' విషయానికి వస్తే, ఇది వివిధరకాల ఛానళ్లతో ఒక ప్యాకేజీగా వస్తుంది, ఇది ఆ ఛానళ్లను కోరుకునేవారికి సరిపోతుంది, ఎవరైతే వాటిని ఇష్టపడతారో వారికీ. ఇక చివరిది మరియు మూడవది అయిన 'All Packs and Channels' విషయానికి వస్తే, ఇది అన్ని చానళ్లను కలిగి ఉంటుంది మరియు చందాదారులు వారికీ అంచనా ఛానలను ఎంచుకునే అవకాశం ఇందులో ఉంటుంది.

అయితే. టాటా స్కై కొన్ని SD మరియు HD ఛానళ్ల కోసం గరిష్టంగా 19 రూపాయలవరకు వాసులు చేయనున్నట్లు గమనించాము, ఇది నెట్వర్క్ బ్రాడ్కాస్టర్లు సూచించిన ధర కంటే అధికంగా ఉండడం గమనార్హం. ఇది గమనిస్తుంటే, ఛానళ్ల ధర పైన 18 % GST టాక్స్ జతచేసినట్లుగా అనిపిస్తోంది.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo