Jio డబుల్ డేటా బెనిఫిట్స్ : భారీగా డేటాని అఫర్ చేస్తోంది
అన్ని కొత్త ప్లాన్లు ఇప్పుడు వార్షిక చందాపై డబుల్ డేటాను అందిస్తున్నాయి.
జియో ఫైబర్ తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొన్ని మార్పులు చేసింది.
జియో ఫైబర్ తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొన్ని మార్పులు చేసింది. దీని కింద వార్షిక చందా ప్లాన్స్ లో అదనపు డేటా ప్రయోజనాలు లభిస్తాయి. జియో ఫైబర్ వెబ్‌సైట్ ప్రకారం, అన్ని కొత్త ప్లాన్లు ఇప్పుడు వార్షిక చందాపై డబుల్ డేటాను అందిస్తున్నాయి.
అంటే ఇప్పుడు Bronze ప్లాన్ 100 జీబీ నెలవారీ డేటాతో 350 జీబీ లభిస్తుంది. అయితే, ఈ అధికడేటా ప్రయోజనం కేవలం వార్షిక ప్లాన్ సభ్యత్వంతో మాత్రమే లభిస్తుంది. వినియోగదారులు నెలవారీ సభ్యత్వంతో కేవలం 250GB డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 100GB ప్లాన్ బెనిఫిట్ మరియు 100GB డబుల్ డేటా లాక్డౌన్ మరియు 50GB ఇంట్రడక్టరీ డేటా బెనిఫిట్స్ ఉన్నాయి.
అదేవిధంగా, సిల్వర్ వార్షిక ప్లాన్ చందాదారులు వార్షిక చందా తీసుకోవడం ద్వారా మొత్తం 800GB నెలవారీ డేటాను పొందుతారు. ఇందులో 200GB అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 200 జీబీ డేటాతో పాటు 200 జీబీ డబుల్ డేటా బెనిఫిట్, 200 జీబీ ఇంట్రడక్టరీ డేటా, 200 జీబీ యాన్యువల్ బెనిఫిట్ డేటాని అందిస్తుంది. ఇక Gold ప్లాన్ గురించి మాట్లాడితే, వార్షిక చందాపై 1,750GB నెలవారీ డేటా ఉంటుంది. ఇందులో 500GB వార్షిక ప్లాన్ బెనిఫిట్, 250GB ఇంట్రడక్టరీ డేటా, లాక్డౌన్ కోసం 500GB డబుల్ డేటా బెనిఫిట్ మరియు 500GB ప్లాన్ బెనిఫిట్ ఉన్నాయి.
జియో ఫైబర్ డైమండ్ ప్లాన్‌కు 4,000 జీబీ హై-స్పీడ్ నెలవారీ డేటా ప్రయోజనం లభిస్తుంది. అప్డేట్ చేయబడిన ప్లానులో అదనంగా 1,250GB నెలవారీ డేటా ప్రయోజనం వచ్చి చేరింది. ఈ ప్లాన్‌లో ప్రాథమిక 250 జీబీ ఇంట్రడక్టరీ డేటా, లాక్డౌన్ కోసం 1,250 జీబీ డేటా, 1,250 జీబీ ప్లాన్ ఉన్నాయి. ఇది కాకుండా, ప్లాటినం ప్లాన్ వార్షిక చందా తీసుకోవడం ద్వారా 7,500GB నెలవారీ డేటాను పొందవచ్చు. దీని వలన 2,500GB అదనపు ప్రయోజనం ఉంటుంది. ఈ ప్లాన్ 2,500 జిబి డేటా బెనిఫిట్, 2,500 జిబి లాక్డౌన్ కోసం డబుల్ డేటా మరియు 2,500 జిబి వార్షిక డేటా బెనిఫిట్ అందిస్తుంది. ఈ ప్రణాళికలో ఇంట్రడక్టరీ డేటా ప్రయోజనం ఏదీ చేర్చబడలేదు.
జియో ఫైబర్ టైటానియం ప్లాన్ ఇప్పుడు 15,000GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 5,000 జీబీ ప్లాన్ బెనిఫిట్, 5,000 జీబీ డబుల్ డేటా, 5,000 జీబీ వార్షిక ప్లాన్ బెనిఫిట్ ఉన్నాయి.
ఇతర టెలికాం ప్లాన్స్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.