Coronavirus Effect : జియో కేవలం రూ.199 రూపాయలకే 1000 GBల హై స్పీడ్ డేటా ప్రకటించింది
రిలయన్స్ జియోఫైబర్ కనెక్షన్ల పైన స్వల్ప కాలానికి ఎక్కువ డేటా కోసం చూస్తున్న వారు ఈ రూ. 199 ప్లాన్ను చూడవచ్చు. ఈ ప్లాన్, ఒక వారం, అంటే 7 రోజుల వ్యాలిడిటీ మరియు 1000 జిబి డేటా ,,లిమిట్ తో వస్తుంది. అంతేకాదు, ఈప్లానుతో మీకు 100Mbps స్పీడ్ తో వస్తుంది మరియు FUP లిమిట్ తరువాత, వేగం 1Mbps కి పడిపోతుంది. ఈ కాంబో ప్లాన్ కొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కోసం, రూ. 199 ధర జీఎస్టీకి ముందు. జీఎస్టీ తరువాత, ఈ ప్లాన్ వినియోగదారులకు రూ .234.82 ఖర్చు చేయవలసి వస్తుంది. టెలికామ్‌టాక్ ప్రకారం, ఒక కస్టమర్ 1 నెల కాలానికి కూడా ఈ ప్లాన్ను ఎంచుకోవచ్చు. దీనికోసం, కస్టమర్‌కు జీఎస్టీతో సహా రూ .1100 ఖర్చవుతుంది మరియు వారికి 100 ఎమ్‌బిపిఎస్ వేగం మరియు 4.5 TB డేటా లభిస్తుంది.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, జియో యొక్క బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 1,000 రూపాయల ధర ఉన్న ఇతర ప్లాన్స్ రూ .849 ప్లాన్ మరియు రూ .1299 ప్లాన్. వంటివి ఉన్నాయి. ఈ 849 రూపాయల ప్లాన్ నుండి వినియోగదారులు 400Mb డేటా + 200GB అదనపు డేటాని 100Mbps వేగంతో పొందుతారు. రూ .1299 ప్లాన్ వినియోగదారులకు నెలకు 1000 జీబీ డేటా + 200 జీబీ అదనపు డేటాతో 250 Mbps స్పీడ్ తో లభిస్తుంది. కాంబో ప్లాన్ ఈ రెండు ప్లాన్‌ల కంటే మెరుగ్గా కనిపిస్తుంది మరియు ఎక్కువ డేటా అవసరమున్న వారికీ ఇది సరిగా సరిపోతుంది.
COVID-19 మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ ఉన్నందున, చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. ఇది డేటా అధిక వినియోగానికి దారితీస్తుంది. అంటే పరిమిత FUP ఉన్నవారు డేటా వినియోగంతో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకోసమే, టెలికాం ఆపరేటర్లు మరియు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులు ఇంటి నుండి పని చేయడానికి సరికొత్త ప్లాన్స్ మరియు ప్యాకేజీలను అందిస్తున్నారు.
ఇందులో భాగంగానే, కొత్త వినియోగదారులకు ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా 10 Mbps బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని జియోఫైబర్ అందిస్తోంది, ఇప్పటికే ఉన్న వాటి కోసం అన్ని ప్లాన్లలో డబుల్ డేటాని కూడా అఫర్ చేస్తోంది. మరోవైపు, బిఎస్ఎన్ఎల్ తన 'వర్క్ @ హోమ్' బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కింద 5 జిబి రోజువారీ డేటాను ఉచితంగా అందిస్తోంది.