జియో WiFi కాలింగ్ తో ఉత్తమమైన వాయిస్ మరియు వీడియో కాల్స్ దీని సొంతం : మరి మీ ఫోను సపోర్ట్ చేస్తుందా?
ప్రతి జియో వినియోగదారుని వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది
రిలయన్స్ జియో ఇప్పటికే వై-ఫై సర్వీస్ లో వాయిస్ మరియు వీడియో కాలింగ్ చేసేవిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించింది. సంస్థ ప్రకారం, ఈ ఫీచర్ గత కొన్ని నెలలుగా పరీక్షా దశలో ఉంది. ఈ కొత్త Jio Wi-Fi కాలింగ్ ఫీచర్ ఏదైనా Wi-Fi బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇక్కడ వాయిస్ మరియు వీడియో కాల్స్ ప్రాథమికంగా VoLTE మరియు Wi-Fi మధ్య మారతాయి.
ఈ సేవను ప్రారంభించడం గురించి జియో డైరెక్టర్ మిస్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, “జియో యొక్క కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి లేదా వారి సమస్యలను పరిష్కరించడానికి మేము నిరంతరం కొత్త ఆవిష్కరనలను తీసుకొస్తాము. ఈ సమయంలో, సగటు జియో వినియోగదారుడు ప్రతి నెలా 900 నిమిషాల కంటే ఎక్కువ వాయిస్ కాల్స్ ను ఉపయోగిస్తున్నారు మరియు పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యతో, జియో వై-ఫై కాలింగ్ పరిచయం ప్రతి జియో వినియోగదారుని వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ”
దేశీయ కాల్స్ కోసం ఈ సేవ ఉచితంగా ఇవ్వబడుతుంది మరియు పైన చెప్పినట్లుగా, కాల్స్ ప్రాథమికంగా మారతాయి. తద్వారా, వినియోగదారులకు అదనపు కాలింగ్ ఆప్ లేదా సిమ్ కార్డ్ అవసరం లేదు. రిలయన్స్ జియో, చాలా స్మార్ట్ ఫోన్లలో వై-ఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరించింది. ఈ జాబితాలో 150 కి పైగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జియో యొక్క కొత్త వై-ఫై కాలింగ్ ఫీచర్ కేవలం వాయిస్ కు మాత్రమే పరిమితం కాదు, ఎందుకంటే కంపెనీ వినియోగదారులకు వై-ఫై ద్వారా వీడియో కాల్స్ చేయడానికి కూడా వీలుంటుంది.
150 కి పైగా స్మార్ట్ ఫోన్లు ఈ ఫీచరును కలిగి వున్నాయి. ఈ ( LINK )ద్వారా మీ ఫోన్ గురించి తెలుసుకోండి.