ఈ నవంబరు నెలలో అన్ని టెలికాం కంపెనీలు కూడా తమ కొత్త ఆఫర్లను తీసుకొచ్చాయి. అయితే, వోడాఫోన్ మరియు జియో మాత్రం ఒకదానిమీద మరొకటి పోటాపోటీగా, తమ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఈ దీపావళికి సరికొత్త Rs. 1699 ధరతో వార్షిక ప్రీపెయిడ్ ప్లానుతో జియో వస్తే, వోడాఫోన్ తన Rs 189 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో మంచి లాభాలను తీసుకొచ్చింది.
వోడాఫోన్ Rs 189 ప్రీపెయిడ్ ప్లాన్
Vodafone Rs 189 ప్రీపెయిడ్ ప్లానుతో, అపరిమిత కాలింగ్ మరియు 2GB డేటా కూడా మీకు అందుతుంది. అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్ కూడా రోజుకు 250 నిమషాలు లేదా వారానికి 1000 నిమిషాల వరకు కాలింగ్ చేసుకునే విధమైన షరతులతో వస్తుంది. వోడాఫోన్ నుండి వచినటువంటి చాల ప్లానులు కూడా ఇటువంటి షరతులతో వచ్చాయి. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో మీకు ఎటువంటి SMS ప్రయోజనాలను అందించడంలేదు వోడాఫోన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 58 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాలింగ్ కోసం ఆధారపడేవారికి ఈ రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి లాభాన్నితెచ్చే ప్లానుగా ఉంటుంది.
జియో Rs 1699 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
ఈ జియో Rs 1699 వార్షిక ప్రీపెయిడ్ ప్లానుతో, అపరిమిత కాలింగ్, రోజువారీ 1.5GB డేటా మరియు డైలీ 100SMS లను కూడా మీకు అందిస్తుంది. ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ఏవిధమైన షరతులు విధించకుండా, పూర్తి అపరిమితంగా అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే మొత్తంగా, 547.5 GB ల డేటాని మీరు పొందుతారు. దీనిని 12 నెలలుగా విభజిస్తే, నెలకు కేవలం 142 రూపాయలు మాత్రమే అవుతుంది. అంతేకాకుండా, నవంబర్ 30వ తేదీవరకు 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులోవుంది.