JIO VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

JIO VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
HIGHLIGHTS

టెలికం ఆపరేటర్లు అందించిన ప్లాన్స్ తో పోల్చిచూద్దాం.

ముందునుండే, ప్రధాన టెలికం సంస్థలు వాటి టారిఫ్ లను పెంచిన విషయం మనందరికీ తెలుసు. అయితే, రేపటి నుండి జియో కూడా తన టారిఫ్ పెంచి కొత్త ప్లాన్లను  విడుదల చేసింది. అయితే, ఈ కొత్త ప్లాన్ల ధరల పరంగా,  వాటిలో ఏది బెస్ట్ ప్లాన్ కావచ్చు లేదా ఏ టెలికం సంస్థ మనకు మంచి ప్రయోజనాలను అందించనున్నది, అని అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు జియో ప్రకటించిన ధరలను, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా టెలికం ఆపరేటర్లు అందించిన ప్లాన్స్ తో పోల్చిచూద్దాం.

అయితే, సరాసరిన ఎక్కువ మంది రీఛార్జ్ చేసే ప్లాన్లను గమనిస్తే కేవలం ఒక నెల (28 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్ను ఎక్కువగా వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అందుకోసమే, ఈ ఒక నెల (28 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్లలో మంచి ప్లానుగా ఈ టెలికం సంస్థ యొక్క ప్లాన్ నిలుస్తోంది అన్న విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

JIO Rs. 199 : ఒక నెల (28 రోజులు) ప్లాన్

జియో యొక్క ఈ Rs. 199 అల్ ఇన్ ప్లాన్ మిగతావాటితో పోలిస్తే కొంచం తక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 123 రూపాయల ప్లాన్ ఉండగా, అది కేవలం 2GB డేటాతో మాత్రమే వస్తుంది. ఇక ఈ 199 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5 GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు జియో యాప్స్ కి యాక్సెస్ అందుతుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ రేపటి నుండి అమలులోకి వస్తుంది. 

భారతీ ఎయిర్టెల్ Rs.248 : ఒక నెల (28 రోజులు) ప్లాన్

భారతీ ఎయిర్టెల్ యొక్క ఈ Rs. 248 ప్లాన్ కూడా చాలా ఎక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 148 రూపాయల ప్లాన్ ఉండగా, అది పూర్తి చెల్లుబాటు కాలానికి కేవలం 2GB  డేటాతో వస్తుంది. ఇక ఈ 248 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎయిర్టెల్ నుండి ఎయిర్టెల్  నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ APP ప్రీమియం కి యాక్సెస్ అందుతుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

వోడాఫోన్ & ఐడియా  Rs.249 : ఒక నెల (28 రోజులు) ప్లాన్    

వోడాఫోన్ ఐడియా యొక్క ఈ Rs. 249 ప్లాన్ కూడా చాలా ఎక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 149 రూపాయల ప్లాన్ ఉండగా, అది పూర్తి చెల్లుబాటు కాలానికి కేవలం 2GB  డేటాతో వస్తుంది. ఇక ఈ 249 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు వోడాఫోన్ & ఐడియా నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు  28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo